క్రైమ్/లీగల్

పిడుగుపాటుకు కూలీ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నడిగూడెం, ఏప్రిల్ 18: పిడుగుపాటుతో కూలీ మృతి చెందిన సంఘటన గురువారం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని సిరిపురంలో నూతనంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కోసం రాక్‌బెడ్డింగ్ పనులు చేసున్న సమయంలో పిడుగుపడటంతో భారీ విద్యుత్ షాక్ వెలువడి అక్కడ పనులు చేస్తున్న కోదాడకు చెందిన ఓర్సు సుబ్బారావు (35)కు తగలడంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందినట్లు ఎస్‌ఐ నరేష్ తెలిపారు.
చిత్రం... పిడుగుపాటుతో మృతిచెందిన కూలీ సుబ్బారావు