క్రైమ్/లీగల్

నెత్తురోడిన రహదారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నగరి / మదనపల్లె /పెద్దారవీడు, ఏప్రిల్ 18: చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో గురువారం జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. చిత్తూరు జిల్లా నగరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు, ఒక యువతి మృతి చెందగా, మదనపల్లె మండలంలో బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో తల్లీ బిడ్డ మృతి చెందారు. అలాగే ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం బొప్పూడు వద్ద ట్రాలీ ఆటో బైక్ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటనల వివరాలిలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం కాంచీపురం ఒరగడంకు చెందిన ఏంజిల్ (24), చెన్నై పోరూరుకు చెందిన ప్రేమ్ (25), కాంచీపురం గూడువాంజేరి కార్తీక్‌నగర్‌కు చెందిన ప్రతుల్‌రాజ్ (19), ధీరజ్ (23), చరణ్ (23), సోలింఘర్‌కు చెందిన జెనియా (23) చెన్నైలోని ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. గురువారం ఎన్నికల సెలవులను పురస్కరించుకుని సరదాగా గడపడానికి కారులో వారు కైలాసకోనకు వచ్చారు. అక్కడ సరదాగా గడిపి వారి సొంత ఊర్లకు వెళ్లి ఓటు వేయడానికి బయలుదేరారు. ఈక్రమంలో ధీరజ్ అతివేగంగా కారు నడపగా నగరి మండలం వీకెఆర్ పురం వద్ద కారు అదుపుతప్పి రోడ్డుకు సమీపంలో నూతనంగా వేసిన ఇంటి పునాదులను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏంజిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ వారిని నగరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
అప్పటికే పరిస్థితి విషమించడంతో వైద్యసేవలు అందించినా ఫలితం లేక ప్రేమ్, ప్రతుల్‌రాజ్ ఆసుపత్రిలో మృతి చెందారు. కాగా మండల కేంద్రం రామసముద్రం పంచాయతీ గుంతలపేటకు చెందిన నూలు నారాయణస్వామి సొంత పనులపై భార్య శివమ్మ (29), రెండేళ్ల కుమారుడుతో ద్విచక్ర వాహనంలో మదనపల్లెకు బయలుదేరారు. ఈక్రమంలో బొమ్మనచెరువు మిట్ట మలుపు వద్ద వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ద్విచక్రవాహనం నడుపుతున్న నారాయణస్వామి కింద పడిపోగా, వెనుక కూర్చున్న భార్య శివమ్మ, రెండేళ్ల కుమారుడు రోడ్డుపై పడటంతో ఆర్టీసీ బస్సు వెనుక చక్రాల కింద పడి ఇద్దరు దుర్మరణం చెందారు. ఇదిలావుండగా ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని కుంట జంక్షన్ వద్ద నుంచి వస్తున్న ట్రాలీ ఆటో బొప్పూడు సమీపంలో బైక్‌ను ఢీకొంది. ఈ సంఘటనలో మార్కాపురం మండలం పెద్దనాగులవరం గ్రామానికి చెందిన చురకా రాజు (25), వినుకొండకు చెందిన భూపని వెంకట్రావు (40) మృతి చెందారు.