క్రైమ్/లీగల్

ఏసీబీ దాడిలో పట్టుబడిన ఇద్దరు ఫారెస్టు అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, ఏప్రిల్ 18: సిరిసిల్ల ఫారెస్టు రేంజిలో నాలుగు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు పట్టుబడ్డారు. గురువారం సాయంత్రం ఏసీబీ అధికారులు పథకం ప్రకారం వలపన్ని సిరిసిల్ల అటవీ శాఖ రేంజ్ కార్యాలయంలో దాడులు చేశారు. ఈ సందర్భంగా డీఎఫ్‌వో శ్రీనివాస్, ఫారెంజ్ రేంజ్ అఫీసర్ అనితలపై కేసు నమోదు చేసి, వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా సిరిసిల్ల ఇన్‌చార్జి ఫారెస్ట్ రేంజి అధికారి అనిత తన కింది అధికారి నుండి రూ.4 లక్షలు తీసుకోగా, ఎసీబీ అధికారులు రెడ్ హండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసులో డీఎఫ్‌వో శ్రీనివాస్ ప్రమేయం ఉండడంతో అతడిపైన, రేంజర్ అనితలపై కేసు నమోదు చేశారు. అనంతరం వీరిని అదుపులోకి తీసుకుని కరీంనగర్‌కు తరలించారు. కాగా సంగారెడ్డి ఎసీబీ డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యలో ఈ దాడులు జరుపగా ఆయన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లారెడ్డిపేట మండలం గొళ్ళపల్లిలో వనరంక్షణ సమితి ఆధ్వర్యంలో నర్సరీని పెంచారు. ఇందులో మొక్కల పెంపకానికి రూ.45 లక్షలు మంజూరు కాగా, దీనికి సంబంధించిన బిల్లులను మంజూరు చేశారు. అయితే ఈ బిల్లులు చెల్లింపులకు డీఎఫ్‌వో శ్రీనివాస్ 15 శాతం అనగా ఆరు లక్షల రూపాయలను గొళ్ళపల్లి సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ ద్వారా వన సంరక్షణ సమితి నుండి లంచంగా సేకరించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ డబ్బు కోసం ఒత్తిడి తీవ్రం చేయడంతో తన వల్ల అంత మొత్తం వసూలు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పాడు. అయితే కనీసం 10 శాతం కమీషన్(లంచం) ఇవ్వాలని డీఎఫ్‌వో శ్రీనివాస్ ఒత్తిడి పెంచారు. దీనితో సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ రూ.4 లక్షలను 10 శాతం ఇవ్వడానికి అంగీకరించారు. దానితో బిల్లులు వన సంరక్షణ సమితి ఖాతాలో బిల్లుల మంజూరు డబ్బు జమ కూడా చేశారు.
అయితే డబ్బుల కోసం ఒత్తిడి పెంచడంతో అంగీకరించిన రూ.4 లక్షల నగదును గొళ్ళపల్లి సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ గురువారం సాయంత్రం తీసుకవచ్చి సిరిసిల్ల రేంజ్ కార్యాలయంలో ఉన్న రేంజ్ అధికారి అనితకు అందచేశాడు. దానితో అనిత డబ్బులు వచ్చాయని, జగిత్యాలలో ఉన్న డీఎఫ్‌వో శ్రీనివాస్‌కు ఫోన్‌లో సమచారం అందించారు. ఆ వెంటనే సంగారెడ్డి జిల్లాకు చెందిన ఏసీబీ అధికారుల బృందం దాడి చేసి అనితను పట్టుకున్నారు.