క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భక్తుల దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చొప్పదండి, ఏప్రిల్ 19: హనుమాన్ చిన్న జయంతిని పురస్కరించుకొని చాలా మంది హనుమాన్ భక్తులు మాలధారణ చేసి ఎంతో పవిత్రంగా నిత్యం పూజలతో దీక్షా కాలం పూర్తి చేసుకొని ఇంటిల్లి పాటి సైతం ఎంతో పవిత్రంగా ఉండి మాల విరమణకు చిన్న జయంతికి ముడుపులు కట్టుకొని దీక్షా కాలం పూర్తి చేసుకొని కొండగట్టు అంజన్న స్వామిని చేరుకొని ముడుపులు అప్పజెప్పి మొక్కులు చెల్లించుకోవటానికి పాదయాత్రతో కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల పరిదిలోని భూపాలపట్నం గ్రామానికి చెందిన పొన్నం అరుణ్, పులి రాజేందర్, ఆవుల నవీన్, మునిగాల ప్రశాంత్, రమేష్‌లు కాలినడకన పాదయాత్రతో భూపాలపట్నం నుంచి గురువారం సాయంత్రం కొండగట్టుకు వెళ్లారు. రాత్రి పూడూరుకు చేరుకొని సాయిబాబ ఆలయంలో నిద్రించారు. ఉదయం 5గంటలకు నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని 5.30గంటల ప్రాంతంలో కొండగట్టుకు పయనమయ్యారు. అక్కడి నుంచి 3కిలో మీటర్లు కాలినడకన కొండగట్టు దగ్గరి ప్రాంతానికి చేరువవుతుండగా ఉదయం 6గంటల ప్రాంతంలో కరీనంగర్ వైపు నుంచి జగిత్యాల వైపు వెలుతున్న లారీ రోడ్డు కింది భాగం నుంచి నడిచి వెళుతున్న పొన్నం అరుణ్, పులి రాజేందర్‌లను ఢీ కొట్టడంతో కొంత దూరంలో ఎగిరి పడి అక్కడికక్కడే మృతి చెందారు. కాగా అరుణ్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రాజేందర్ రేషన్ డీలర్‌గా పని చేస్తు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇద్దరు కూడ వారి కుటుంబంలో ఒకరే మగ సంతానం. దీంతో చేతికందిన కుమారులు ఇద్దరు మృతి చెందటంతో ఆ కుటుంబాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. భక్తితో కొండగట్టుకు వెళ్లిన వారు ఇలా విగత జీవులు అవుతారని ఊహించలేదంటు గ్రామస్తులు కంట తడి పెట్టుకున్నారు. చిన్న జయంతి రోజు ఇలా గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మరణించడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకొన్నాయి.
దిగ్భ్రాంత్రి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే
పరమ పవిత్రంగా మాలాధరణ వేసుకొని దీక్షా కాలం ముగించుకొని చిన్న జయంతికి కొండగట్టుకు విలుతుండగా చొప్పదండి మండల పరిదిలోని భూపాలపట్నం గ్రామానికి చెందిన అరుణ్, రాజేందర్‌లు పాదయాత్రతో వెలుతుండగా కొండగట్టు ప్రాంతంలో లారీ ఢీకొని మృతి చెందడటం పట్ల చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డిలు దిగ్భ్రాంత్రిని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే రాజధానిలో ఉండటంతో ఫోన్ ద్వారా వారి మరణం కుటుంబ సభ్యులకు తీరని లోటని వారికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని అందించాలని కోరారు.