క్రైమ్/లీగల్

ఘోర రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టిన సంఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల లక్ష్మీనరసింహ దేవాలయం సమీపంలో శనివారం చోటుచేసుకుంది. చెన్నారావుపేట మండలం జల్లి గ్రామానికి చెందిన సింగారపు అనీల్ (35) తన ద్విచక్ర వాహనంపై తన కవల పిల్లలు జహ్నవి (6), జాష్ణవి (6)తోపాటు మేనకోడలు గొర్రె సాత్విక (10)ను తీసుకొని, ఆదివారం తమ గ్రామంలో ఈస్టర్ పండుగ కోసం వరంగల్ నగరం నుండి బయలుదేరారు. గీసుకొండ మండ లం నర్సంపేట-వరంగల్ ప్రధాన రహదారి కొమ్మాల వద్దకు చేరుకున్నప్పుడు నర్సంపేట నుండి వరంగల్ వైపువేగంగా వస్తున్న కారు వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ సంఘటనలో బలమైన గాయాలైన కారణంగా నలుగురూ అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, కారులో ఉన్న వారందరు మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. సంఘటన స్థలానికి మృతుల బంధువులు చేరుకోవడంతో ఆ ప్రాంత మంతా రోదనలతో మిన్నంటింది. డీసీపీ నాగరాజు, ఎసీపీ శ్యాంసుందర్, స్ధానిక ఎస్సై హుటాహుటిన అక్కడికి చేరుకొని, ప్రమాద వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాలను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఈ సంఘటన నర్సంపేట-వరంగల్ ప్రధాన రహదారిపై జరగడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో పోలీసులు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వాహనాలను పంపించారు.

చిత్రం... రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అనీల్, పిల్లలు