క్రైమ్/లీగల్

ఎదురెదురుగా రెండు కార్లు ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేశ్వరం, ఏప్రిల్ 20: ఎదురెదురుగా రెండు కార్లు ఢీకొనగా అందులో ప్రయాణిస్తున్న ఏనిమిదికి తీవ్ర గాయాలైనాయి. చికిత్స నిమిత్తం రెండు అంబులెన్సుల్లో శంషాబాద్ ఆసుప్రతికి తరలించినట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రమాదం హైదారాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారిపై అవేర్‌గేటు వద్ద శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. కందుకూర్ మండలం గుమ్మడవెళ్లి గ్రామానికి చెందిన యువకుడు మహేష్, కృష్ణ, కిరణ్, చింటు కారులో హైదారాబాద్‌కు వెళ్తున్నారు. హైదారాబాద్ నుంచి కడ్తాల్ వైపు వెళ్తున్న మరో కారును డీ కొంది. ప్రమాదంలో ఇద్దరు మహిళలతో పాటు మరో ఆరుగురుకి తీవ్రగాయాలైనట్టు ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. భారీ వర్షం వస్తుండంటంతో ముందు వచ్చే వాహనం కనిపించకపోగా గుమ్మడవెళ్లి నుంచి హైదారాబాద్ వైపు వెళ్లే కారు ఎదురెదురుగా బలంగా ఢీ కొన్నాయి. తీవ్రంగా గాయపడిన క్షేతగాత్రులను అంబులెన్సులో ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. దీంతో అర్ధగంట వరకు రోడ్డు పై ట్రాఫిక్ జామైంది. ఎస్‌ఐతో పాటు పోలీసులు వర్షంలో కష్టపడి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఎరువు ట్రాక్టర్ బోల్తా
షాబాద్, ఏప్రిల్ 20: షాబాద్ మండల పరిధిలోని నాగర్‌కుంట గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట రోడ్డు చిన్నగా ఉన్నందున ఎదురుగా వస్తున్న పాల ట్యాంకర్‌ను తప్పించబోయిన ఎరువు ట్రాక్టర్ ట్రాలీ బోల్తాపడింది. దీంతో రోడ్డుపై ఇతర వాహనాలు వెళ్లడానికి ఇబ్బందిగా మారింది. హైతాబాద్ నుంచి షాబాద్‌కు రేండు లైన్ల రోడ్డు మంజురైంది. గ్రామంలో డబుల్ రోడ్డుగా మంజురైన రోడ్డు సింగిల్ రోడ్డుగా ఉంది. దీంతో గ్రామం మధ్యలో ఉన్న మూలమలుపులకు సూచిక బొర్డులు లేకపోవడంతో వాహనాదారులు తొందరపడి ప్రమాదాలకు గురవుతున్నారు. అర్ అండ్ బీ అధికారులు స్పందించి రోడ్డు వేడల్పు పై, మూలమలుపులపై దృషి సారించి సూచిక బొర్డులు ఏర్పాటు చేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.