క్రైమ్/లీగల్

11 కిలోల వెండి స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: హైదరాబాద్‌లో ఖరీదైన బంగారు షాపులను ఎంచుకుని దోపిడీ చేసే దొంగల ముఠాను అరెస్టు చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. పట్టుబడిన ముఠా నుంచి 11 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నామన్నారు. సోమవారం హైదరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ ముఠా సభ్యులు పలుమార్లు జైలుకు వెళ్ళినా బుద్ధిమారలేదని మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. ముఠాలోని 9 మంది వివిధ కేసుల్లో ఉన్నారన్నారు. ముఠాకు నిజాముద్దీన్ అనే వ్యక్తి నాయకత్వం వహిస్తుంటాడని ఆయన తెలిపారు. సభ్యులందరూ 25 సంవత్సరాల లోపువారేనని తెలిపారు. ముఠాను సౌత్‌జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసినట్లు చెప్పారు. ఓ ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు ముఠాను పట్టుకోవడం జరిగిందన్నారు. నిజాముద్దీన్ గతంలో ట్రావెల్స్, చికెన్ షాపులు నడిపాడని, వ్యాపారంలో నష్టం రావడంతో దొంగతనాలను ఎంచుకున్నాడన్నారు. ఖరీదైన షాపుల్లో దొంగతనానికి వెళ్ళే ముందు తన ముఠా సభ్యులను షాపుల్లోకి పంపించి దొంగతనాకి మార్గాలను పరిశీలిస్తాడనన్నారు. శాలిబండ పోలీ సులు ముఠా కదలికలపై నిఘా పెండంతో దొరికిపోయారన్నారు. యజమానులు తమ షాపుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.