క్రైమ్/లీగల్
మరో విద్యార్థి ఆత్మహత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 24 April 2019
నెక్కొండ: ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫెయిల్ అయ్యాననే మనస్తా పంతో మరో విద్యార్థి ఆత్మహ త్యకు పాల్పడ్డాడు. వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండ లం రెడ్లవాడ శివారు మత్తడితండాకు చెందిన బానోత్ నవీన్ (16) మంగళవారం రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. నవీన్ గతవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో మనస్తాపం చెంది, మంగళవారం మధ్యాహ్నం నెక్కొండలో పని ఉందంటూ ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. కుమారుడి ఆత్మహత్యతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.
బానోత్ నవీన్ (ఫైల్‌ఫొటో)