క్రైమ్/లీగల్

నాపై పిటిషన్‌ను కొట్టేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 23: మహారాష్టల్రోని మాలెగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలైన తనను భోపాల్ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయకుండా నిరోధించాలని దాఖలు చేసిన అభ్యర్థనను కొట్టివేయాలని బీజేపీ నాయకురాలు ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ కోర్టు తనకు ఇదివరకే క్లీన్ చిట్ ఇచ్చిందని ఆమె తెలియజేసింది. ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు జడ్జి విఎస్ పదాల్కర్ ముందు ఆమె తన న్యాయవాది ద్వారా వాదన వినిపిస్తూ ఎన్నికల్లో పోటీ చేయకుండా తనపై దాఖలైన పిటిషన్ పసలేనిదని, కేవలం రాజకీయ ప్రయోజనాన్ని ఆశించే దానిని దాఖలు చేశారని ఆరోపించారు. అయినా ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి అర్హతను నిర్ణయించాల్సింది కోర్టు కాదని, దానిపై తుది నిర్ణయం ఎన్నికల సంఘానిదేనని ఆమె పేర్కొంది. దీంతో కేసును తదుపరి విచారణ నిమిత్తం బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు జడ్జి ప్రకటించారు. కాగా, ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ 2008లో జరిగిన మాలెగావ్ కేసులో ప్రధాన నిందితురాలని, ఆమె భోపాల్ నియోజకవర్గంలో ఎంపీగా పోటీ చేయకుండా అనర్హురాలిగా ప్రకటించాలని కోరుతూ పేలుళ్ల బాధితుడి తండ్రి ఒకరు గురువారం కోర్టును ఆశ్రయించారు. దీనిపై తగు వివరణ ఇవ్వాలని కోర్టు ఆమెను ఆదేశించింది. ఇలావుండగా, భోపాల్‌లో ఆమె కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్‌తో పోటీ పడుతున్నారు.
చిత్రం... భోపాల్‌లో మంగళవారం నామినేషన్ వేసేందుకు వస్తున్న బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్