క్రైమ్/లీగల్

గుజరాత్ సర్కార్‌కు సుప్రీం షాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. గ్యాంగ్ రేప్ బాధితురాలు బిల్కిస్ బానోకు రూ. 50 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే ఆమెకు గృహ సదుపాయం కల్పించండంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని గుజరాత్ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. 2002 అల్లర్ల సందర్భంగా బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. దీనికి బాధ్యులైన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఆదేశించింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో కేసులో ఓ ఐపీఎస్ అధికారిని బాంబే హైకోర్టు దోషిగా నిర్ధారించింది. తాజాగా బానో పిటిషన్‌ను విచారించిన జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం బాధ్యులైన అధికారుల పెన్షన్లు, తదితర రాయితీలను నిలిపివేయాలని ఆదేశించింది. గతంలో గుజరాత్ ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల రూపాయల పరిహారాన్ని తిరస్కరించిన బానో సుప్రీం కోర్టును ఆశ్రయించి విజయవంతమయ్యారు. పోలీసు అధికారులపై రెండు వారాల్లో కఠిన చర్యలు తీసుకోవాలని గత నెల 29న సుప్రీం కోర్టు గుజరాత్ ప్రభుత్వానికి సూచించింది. న్యాయవాది శోభాగుప్తా బాధితురాలు బానో తరఫున సుప్రీంలో వాదించారు. హైకోర్టులో దోషులుగా నిర్ధారణ అయిన అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని శోభాగుప్తా ఆరోపించారు. ఐపీఎస్ అధికారి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంలోనే పనిచేస్తున్నారని, ఈ ఏడాది పదవీ విరమణ చేయనున్నాడని ఆమె కోర్టుకు తెలిపారు. మిగతా నలుగురు అధికారుల పెన్షన్లు, ప్రభుత్వం నుంచి రావల్సిన రాయితీలు ఆపలేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బానో కేసు విచారణలో ఐదుగురు పోలీసు అధికారులను బాంబే హైకోర్టు దోషులుగా తేల్చిందని న్యాయవాది గుర్తుచేశారు. మానవ మృగాల వికృత చర్యలతో బానో జీవితం దుర్భరంగా మారిందని, ఆమెకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయలేమని శోభాగుప్తా స్పష్టం చేశారు. సీనియర్ న్యాయవాది తుషార్ మెహతా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదిస్తూ అధికారులపై చర్యలకు ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిపారు. ఇలాంటి ఘటనలు జరిగేటప్పుడు ఐదు లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలన్నది ప్రభుత్వ విధానంగా మెహతా బెంచ్ దృష్టికి తెచ్చారు.
ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం బిల్కిస్ బానో కుటుంబంపై 2002 మార్చి 3న అల్లరి మూక దాడి చేసింది. గోధ్రా అల్లర్లకు ప్రతీకారంగా అహ్మదాబాద్ సమీపంలోని రంధీక్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. హిందూ అతివాద మూకదాడి చేసి బానో కుటుంబ సభ్యులు ఏడుగుర్ని పాశవికంగా చంపేసింది. ఆ సమయంలో ఆమె ఐదు నెలల గర్భిణీ. ప్రతికారేచ్ఛతో రగిలిపోతున్న ముష్కరులు బానోపై అత్యాచారానికి తెగబడ్డారు. తొలుత ఈ కేసు అహ్మదాబాద్ కోర్టులో విచారణకు వచ్చింది. అయితే సాక్షాలు తారుమారుచేసే అవకాశం ఉందని వేడుకోగా ముంబయి కోర్టుకు సుప్రీం బదిలీ చేసింది. 2004 ఆగస్టులో కేసు బదిలీ అయింది. 2008 జనవరి 21న కేసు విచారించిన ప్రత్యేక కోర్టు 11 మంది రేపిస్టులకు యావజ్జీవ శిక్ష విధించింది. పోలీసులు, డాక్టర్లతో పాటు ఏడుగుర్ని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. 2017 మే 4న బాంబే హైకోర్టు ఐదుగురు పోలీసు అధికారులు, ఇద్దరు డాక్టర్లను దోషులుగా తేల్చింది. ఐపీసీలోని 218 (విధి నిర్వహణలో నిర్లక్ష్యం), 201 (సాక్ష్యాలు తారుమారు) సెక్షన్ల కింద దోషులుగా నిర్ధారించింది. తరువాత నలుగురు పోలీసు అధికారులు, ఇద్దరు డాక్టర్లు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. సుప్రీంను ఆశ్రయించిన వారిలో ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ భాగోరా ఉన్నాడు. అంతకు ముందు ట్రయల్ కోర్టు తీర్పునూ బాంబే హైకోర్టులో సవాల్ చేసినా ఫలితం దక్కలేదు.