క్రైమ్/లీగల్

ఆ ఆరోపణలపై లోతుగా విచారిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌ని లైంగిక ఆరోపణల కేసులో ఇరికించేందుకే ఉద్దేశపూర్వకంగా కుట్ర పన్నారని న్యాయవాది ఉత్సవ్ సింగ్ బెయిన్స్ చేసిన ఆరోపణలపై లోతుగా విచారిస్తామని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సుప్రీం సీజేపై వచ్చిన లైంగిక ఆరోపణలు, మరోవైపు ఉద్దేశపూర్వకంగా కుట్ర జరిగినట్టు ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో సుప్రీం బుధవారం తీవ్రంగా స్పందించింది. సీజేపై వచ్చిన ఆరోపణలు, అనంతరం జరిగిన పరిణామాలపై కింది స్థాయి నుంచి విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. సుప్రీం చీఫ్ జస్టిస్‌ను ఇరికించేందుకు కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా కుట్రకు పాల్పడ్డారని న్యాయవాది బెయిన్స్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన డివిజన్ బెంచ్ బుధవారం ఉదయం సీబీఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఢిల్లీ పోలీస్ అధికారికి సమన్లు జారీ చేసింది. ఈ వ్యవహారం దేశ న్యాయవ్యవస్థ స్వతంత్రతను ‘తీవ్రంగా కలచివేస్తోంది’ అని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన ముగ్గురు జడ్జీలు గల ప్రత్యేక బెంచ్ అభిప్రాయపడింది. అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కూడా విచారణకు సిద్ధంగా ఉండాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ‘ఇది విచారణ కాదు.. ఆ అధికారులతో రహస్యంగా సమావేశం అవుతాం.. ఇందుకు ఎలాంటి ఆధారాలు వెల్లడించాలని మేం కోరడంలేదు’ అని త్రిసభ్య బెంచ్ పేర్కొంది. సీబీఐ డైరెక్టర్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, ఢిల్లీ పోలీస్ కమిషర్‌తో మధ్యాహ్నం 3 గంటలకు మరోసారి భేటీ అవుతామని బెంచ్ స్పష్టం చేసింది. ఇదిలావుండగా, బుధవారం ఉదయం న్యాయవాది ఉత్సవ్ సింగ్ బెయిన్స్ కోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని లైంగిక వేధింపుల కేసులో ఇరికించేందుకే కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. సీజేను కుట్రలో బలిచేసేందుకు ఉద్దేశించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. ఇందుకు బెంచ్ న్యాయవాది బెయిన్స్ వద్ద గల ఆధారాలను ఒక సీల్డ్ కవర్ ద్వారా స్వీకరించింది. ఈ అంశం ‘తీవ్రంగా కలచివేస్తోంది’ అని వ్యాఖ్యానించింది. సీబీఐలో డైరెక్టర్ హోదా గల బాధ్యత కలిగిన అధికారిని తమతో కలసి మాట్లాడేందుకు పిలవాలని జస్టిస్ మిశ్రా అటార్నీ జనరల్ వేణుగోపాల్‌ను సూచించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఇరికించేందుకు కొంతమంది వ్యక్తులు కుట్ర పన్నారంటూ ఇందుకు సంబంధించి న్యాయవాది ఈనెల 20న ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన అంశాలను అటార్నీ జనరల్ వేణుగోపాల్ బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. సొలిసిటర్ జనరల్ మెహతా సైతం సుప్రీం సీజేపై వచ్చిన ఆరోపణలు, మరోపక్క న్యాయవాది బెయిన్స్ చేసిన వ్యాఖ్యలు కలచివేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. స్పెషల్ ఇనె్వస్టిగేషన్ టీమ్ (సిట్) ద్వారా ఈ అంశంపై దర్యాప్తు చేసేందుకు కోర్టు ఆదేశిస్తే సమంజసంగా ఉంటుందని ఆయన సూచించారు. ఈ దర్యాప్తులో వాస్తవావలేమిటో బహిర్గతం అవుతాయని, దీని ద్వారా విశ్వాసానికి మరింత స్ఫూర్తి నింపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మెహతా వ్యాఖ్యలతో అటార్నీ జనరల్ వేణుగోపాల్ సైతం ఏకీభవిస్తూ ఈ అంశంపై సమగ్ర విచారణ జరపాలని సూచించారు. ఈ సందర్భంగా జస్టిస్ మిశ్రా మాట్లాడుతూ ‘ఇది చాలా సున్నితమైన అంశం’. సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి గొగోయ్‌నే స్వయంగా అంతర్గత విచారణకు అంగీకరించారు. సీజే నిర్ణయం భారతదేశ చరిత్రలోనే ఇలాంటి అసాధారణ నిర్ణయం ప్రకటించడం ఇదే తొలిసారి. ఇంతవరకు ఏ చీఫ్ జస్టిస్ కూడా తనపై వచ్చిన ఆరోపణలపై స్వీయ విచారణకు సిద్ధం కాలేదు’ అని అని వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా, న్యాయవాది బెయిన్స్‌కు పూర్తి భద్రత కల్పించాలని ఆదేశించిన బెంచ్ ఇదే సందర్భంలో బెయిన్స్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలను నాశనం కాకుండా ఉండేందుకు లేదా రాజీ పడేందుకు ఆస్కారం కల్పించకూడదని పేర్కొంది.