క్రైమ్/లీగల్

వీవీప్యాట్ స్లిప్‌లు 50శాతం లెక్కించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లతోపాటుగా ఏర్పాటుచేసిన వీవీ ప్యాట్ స్లిప్పులను 50 శాతం లెక్కించాలని 21 విపక్ష పార్టీలు సుప్రీం కోర్టుకు మరోమారు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు బుధవారం 21 పార్టీలు సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయి. ప్రతి నియోజకవర్గంలోని ఈవీఎంతోపాటు ఏర్పాటుచేసిన ఒక్క వీవీ ప్యాట్ స్లిప్పులను మాత్రమే లెక్కించాలని కేంద్ర ఎన్నికల సంఘం గతంలో నిర్ణయించింది. దీనిపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతోపాటు మొత్తం 20కి పైగా పార్టీలు ప్రతి నియోజకవర్గంలోని వీవీ ప్యాట్ స్లిప్పులను 50 శాతం లెక్కించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. 50 శాతం వీవీ ప్యాట్లు లెక్కిస్తే ఎన్నికల ఫలితాలు ప్రకటించడానికి ఐదు రోజుల సమయం పడుతుందని.. ఇది సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల సంఘం అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై ప్రతి నియోజకవర్గలోని ఏవైనా ఐదు వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని సీఈసీని సుప్రీం ఆదేశించింది. దేశంలో నాల్గోదశ పోలింగ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో విపక్ష పార్టీలు ఎన్నికల నిర్వహణపై, అలాగే ఈవీఎంల పనితీరుపై సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే 50 శాతం వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలని విపక్ష పార్టీలు సుప్రీంకోర్టులో గతంలో ఇచ్చిన ఆదేశాలపై రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయి.