క్రైమ్/లీగల్

వరికోత యంత్రం కింద పడి మహిళ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, ఏప్రిల్ 24: ప్రమాదవశాత్తు వరికోత యంత్రం కిందపడి మహిళ మృతి చెందిన సంఘటన భోగారం గ్రామంలో చోటు చేసుకుంది. సీఐ నరేందర్ గౌడ్ వివరాల ప్రకారం భోగారం గ్రామానికి చెందిన మాసాని కృష్ణారెడ్డి, సుగుణమ్మ తమ వ్యవసాయ పొలంలో వరికోత యంత్రంతో వరిని కోస్తున్నారు. వరికోస్తుండగా, మెషీన్ వెనకాలకు సుగుణమ్మ వచ్చేసింది. ఇది గమనించని మెషీన్ డ్రైవర్ వెనకాల ఉన్న సుగుణమ్మ (55)పైకి వెళ్లగా అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. మెషీన్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.