క్రైమ్/లీగల్

నిప్పుతో చెలగాటమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అత్యున్నత న్యాయస్థానాన్ని రిమోట్ కంట్రోల్ చేయాలనుకోవడమంటే నిప్పుతో చెలగాటమాడటమేనని సుప్రీం కోర్టు జస్టిస్ అరుణ్ మిశ్రా సారథ్యంలోని సుప్రీం కోర్టు ప్రత్యేక బెంచి హెచ్చరించింది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల వెనుక పెద్ద కుట్రే ఉందన్న అంశంపై దర్యాప్తు చేయడానికి మాజీ న్యాయమూర్తి ఎకె పట్నాయక్ సారధ్యంలో గురువారం ఓ కమిటీని నియమించింది. గత మూడు సంవత్సరాలుగా సర్వోన్నత న్యాయస్థానాన్ని భ్రష్టుపట్టించేందుకు ఓ పథకం ప్రకారం ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేసింది.ఈ ప్రయత్నాలను ఆపకపోతే ఓ గొప్ప వ్యవస్థను కోల్పోతామని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించింది. లైంగిక వేధింపుల ఆరోపణలతో ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌ని ఇరికించడం, సుప్రీం బెంచ్‌లను ‘్ఫక్స్’ చేయడం వెనుక పెద్ద కుట్రే ఉందని న్యాయవాది ఉత్సవ్ సింగ్ బెయిన్స్ దాఖలు చేసిన అఫిడవిట్‌పై గురువారం విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. కాగా, గొగోయ్‌పై వచ్చిన ఆరోపణలను విచారించేందుకు ఏర్పాటయిన త్రిసభ్య కమిటీలో సభ్యుడైన జస్టిస్ ఎన్‌వి రమణ తప్పుకున్నారు. గొగోయ్‌పై ఆరోపణలు చేసిన మహిళ ఈ ప్యానల్‌లో జస్టిస్ రమణ కొనసాగడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన తప్పుకోవడం గమనార్హం. చీఫ్ జస్టిస్ గొగోయ్‌కి రమణ సన్నిహిత మిత్రుడని, తరచు ఆయన ఇంటికి వెళతారంటూ ఆ మహిళ ఆరోపించింది. దాదాపు అరగంట పాటు న్యాయవాది ఉత్సవ్ సింగ్ బెయిన్స్ అఫిడవిట్‌పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. సర్వోన్నత న్యాయస్థానం బలహీనం కాదని, ఎవరూ దీన్ని రిమోట్ కంట్రోల్ చేయలేరన్న బలమైన సంకేతాన్ని దేశానికి అందించాల్సిన తరుణం ఆసన్నమైందని న్యాయమూర్తులు ఆర్‌ఎఫ్ నారిమన్, దీపక్ గుప్తాలతో కూడిన ఈ ధర్మాసనం ఉద్ఘాటించింది.