క్రైమ్/లీగల్

నీటి అక్రమ కనెక్షన్ల జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి అక్రమంగా ఓ బహుళ అంతస్తు భవనానికి అక్రమ నీటి కనెక్షన్ తీసుకున్న వారిపై జలమండలి విజిలెన్స్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేసింది. వేసవి కాలం కావడంతో నీటి సరఫరాకు తీవ్ర ఆటాంకం కల్గిస్తున్న అక్రమ నీటి కనెక్షన్లు కలిగిన వారిపై జలమండలి విజిలెన్స్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు విజిలెన్స్ విభాగం పోలీసులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపడుతోంది. అక్రమ నీటి కనెక్షన్లు కలిగిన ఇంటి యాజమానులపై క్రిమినల్ కేసులను సైతం నమోదు చేస్తోంది. తాజాగా గురువారం జలమండలి విజిలెన్స్ పోలీసులు చైతన్యపూరి, హరిపురికాలనీలోని మెస్సర్ పరిమళ నివాస్ అపార్ట్‌మెంట్ భవనానికి అధికారుల అనుమతి లేకుండా అక్రమంగా నల్లా కనెక్షన్ తీసుకున్నారు. ఇది గుర్తించిన జలమండలి విజిలెన్స్ అధికారులు జలమండలి ఎండీ దానకిషోర్ ఆదేశాల మేరకు అక్రమ నల్లా కనెక్షన్‌ను తొలగించడంతో పాటు అపార్ట్‌మెంట్‌కు సంబంధించిన అధ్యక్షుడు పీ.రాంబాబు, సెక్రటరీ రాంచందరన్‌లతో పాటు అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న 24 మందిపై దిలుసుఖ్‌నగర్ చేతన్యపూరి పోలీస్టేషన్‌లో ఐపీసీ 269, 430, 379 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగిందని జలమండలి విజిలెన్స్ పోలీసు ఇన్‌స్పెక్టర్ తిరుపతి తెలిపారు.