క్రైమ్/లీగల్

మోదీ-చోక్సీ కార్ల వేలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ను మోసగించిన కేసులో నిందితులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు చెందిన 13 లగ్జరీ కార్లను వేలం వేశారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ. 3.29 కోట్లు వచ్చినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం తెలిపింది. ఈడీ గతంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈ వాహనాలను స్వాధీనం చేసుకుంది. ఈడీ మోదీ-చోక్సీలకు చెందిన 13 వాహనాలను వేలం వేయడానికి మార్చిలోనే ముంబయిలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు నుంచి అనుమతి తీసుకుంది. మోదీ-చోక్సీ ద్వయం పీఎన్‌బీని మోసగించి 2 బిలియన్ డాలర్ల రుణం తీసుకున్నారనే అభియోగం నేపథ్యంలో చోటు చేసుకున్న మనీలాండరింగ్‌పై దర్యాప్తులో భాగంగా ఈడీ ఈ చర్య తీసుకుంది. మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ (ఎంఎస్‌టీసీ) లిమిటెడ్ గురువారం ఈ-వేలాన్ని నిర్వహించిందని ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. 13 వాహనాలలో మోదీకి చెందినవి 11, మెహుల్ చోక్సీకి చెందినవి రెండు ఉన్నాయని వివరించింది.