క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో డిప్యూటీ తహశీల్దార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గరిడేపల్లి, ఏప్రిల్ 29: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ రూ. 8వేలు లంచం రైతు నుంచి తీసుకుంటుండగా సోమవారం ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. మండలంలోని కుతుబిషాపురం గ్రామానికి చెందిన కారింగుల లింగయ్యకు వారసత్వంగా వచ్చిన భూమికి సంబంధించిన రికార్డులు మార్చి రెవిన్యూ సిబ్బంది పట్టా చేశారు. లింగయ్య బతుకుదెరువుకోసం కొంతకాలంగా హుజుర్‌నగర్ మండలం బూరుగడ్డ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. గత 7 సంవత్సరాలుగా కుతుబిషాపురం గ్రామంలో ఉన్న భూమిని గుడుగుంట్ల వెంకయ్య అనే వ్యక్తికి కౌలుకు ఇచ్చాడు. అయితే రెండు సంవత్సరాలుగా కౌలు ఇవ్వటంలేదని లింగయ్య తెలిపారు. కుతుబిషాపురం గ్రామానికి చెందిన కొంతమంది భూమి పట్టా మార్చుకున్నారని లింగయ్యకు ఉప్పందించారు. దీంతో లింగయ్య గరిడేపల్లిలోని రెవిన్యూ కార్యాలయానికి వెళ్లి తెలుసుకోగా తనపేరుమీద ఉన్న సర్వెనెంబర్ 399లో ఉన్న భూమిని తన అక్క లక్ష్మి, వెంకయ్యల పేరుమీద పట్టా అయినట్లు ఉందని తెలిసింది. ఈవిషయంపై డిప్యూటి తహశీల్దార్ సత్యనారాయణ వద్దకు వెళ్లి అడుగగా 20వేలు లంచం ఇస్తే నీపేరుమీద పట్టా ఇస్తానని చెప్పినట్లు లింగయ్య తెలిపారు. నావద్ద డబ్బులు లేవని నేను పేదవాడినని చెప్పినా వినకపోవడంతో కనీసం 1980 నుంచి ఉన్న పాత పహాణీలు ఇవ్వాలని కొరినట్లు తెలిపారు. పహాణీలకు కూడా 15వేలు లంచం ఇస్తేనే అందచేస్తామని చెప్పటంతో 8వేలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. సోమవారం డబ్బులు తీసుకుని కార్యాలయానికి వెళ్లగా కార్యాలయంలో పనిచేస్తున్న ప్రైవేటు వ్యక్తి ప్రకాశంకు ఇవ్వాలని సూచించనట్లు తెలిపారు. 8వేల రూపాయలను ప్రకాశంకు ఇవ్వగానే పహాణీలను ఇచ్చాడని, అదే సమయంలో అక్కడే కాచుకుని ఉన్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యండడ్‌గా పట్టుకున్నట్లు తెలిపారు.
ఏసీబీ డీఎస్పీ వివరణ
ఈ విషయంపై నల్గొండ రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఏపి ఆనంద్‌కుమార్ విలేఖరులతో మాట్లాడుతొ గరిడేపల్లి తహశీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటి తహశీల్దార్ సత్యనారాయణ సూచన మేరకు కార్యాలయంలో పనిచేస్తున్న ప్రైవేటు సిబ్బంది ప్రకాశం కుతుబిషాపురం గ్రామానికి చెందిన కారింగుల లింగయ్య అనే రైతునుంచి 8వేలు లంచం తీసుకుంటుంగా పట్టుకున్నట్లు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

చిత్రం... లంచంతో పట్టుబడిన డిప్యూటీ తహశీల్దార్ సత్యనారాయణ
ప్రైవేటు వ్యక్తితోపాటు డబ్బును చూపిస్తున్న అధికారులు