క్రైమ్/లీగల్

మోదీ, షా ఉల్లంఘనలను పట్టించుకోని ఈసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ)ని ఉల్లంఘించినప్పటికీ ఎన్నికల సంఘం (ఈసీ) ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ దాఖలయిన ఒక పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం ఈసీకి నోటీసు జారీ చేసింది. మోదీ, షాలు విద్వేష ప్రసంగాలు చేశారని, తమ రాజకీయ ప్రచారానికి సాయుధ బలగాలను ఉపయోగించుకున్నారని, వీటిపై ఈసీకి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంటూ అస్సాంలోని సిల్చార్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయిన కాంగ్రెస్ ఎంపీ, అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితా దేవ్ తన పిటిషన్‌లో ఆరోపించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు ఎస్‌కే కౌల్, కేఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను గురువారం విచారిస్తానని తెలియజేసింది. పిటిషనర్ చేసిన అభ్యర్థనపై ఈసీకి అవసరమయిన ఆదేశాలు జారీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు ధర్మాసనం పేర్కొంది. అయితే, మంగళవారం మధ్యాహ్నం సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం దేవ్ పిటిషన్‌ను న్యాయమూర్తులు దీపక్ గుప్తా, సంజీవ్ ఖన్నాలతో కూడిన మరో ధర్మాసనం కోర్ట్ నంబర్ 10లో మధ్యాహ్నం రెండు గంటలకు విచారిస్తుందని తెలిపింది. న్యాయమూర్తులు గుప్తా, ఖన్నాలతో కూడిన ధర్మాసనం తాను తాజా ఇతర పిటిషన్లను విచారించబోవడం లేదని, వాటిని తగిన ధర్మాసనమే విచారిస్తుందని ప్రకటించింది. ఫలితంగా దీంతో దేవ్ పిటిషన్‌ను మళ్లీ సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనమే చేపట్టింది. ఈసీకి నోటీసులు జారీ, గురువారం ఉదయం పదిన్నర గంటలకు పిటిషన్‌ను విచారించనున్నట్టు ఈ ధర్మాసనం ప్రకటించింది.