క్రైమ్/లీగల్

మే 4లోగా సమాధానం చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: రాఫెల్‌పై రివ్యూ పిటిషన్లకు సంబంధించి మే 4వ తేదీలోగా సమాధానం చెప్పాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఫ్రాన్స్ రాఫెల్ కంపెనీ నుంచి 36 యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను డిసెంబర్‌లో సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఒప్పందంలోఅనేక అవకతవకలు చోటుచేసుకున్నందున పునః విచారణ చేపట్టాలని దాఖలైన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించింది. మే 4వ తేదీలోగా సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని బెంచ్ ఆదేశించింది. రాఫెల్ కేసులో పిటిషనర్ వినియోగించిన ‘చోరీపత్రాల’పై కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేసిన అభ్యంతరాలను ఇంతకు ముందే సుప్రీం తిరస్కరించింది. తాజాగా తమకు నాలుగు వారాల గడువుఇవ్వాలన్న అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అభ్యర్థనను సీజే రంజన్ గొగోయ్ సారధ్యంలోని న్యాయమూర్తులు ఎస్‌కే కౌల్, కేఎం జోసెఫ్‌తో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. మే 4న నాటికి సమాధానం ఇవ్వాలని, 6న పిటిషనర్ల వాదన వింటామని బెంచ్ ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రులు అరుణ్‌శౌరి, యశ్వంత్ సిన్హా, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ 2018 డిసెంబర్ 14న రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. రాఫెల్ ఒప్పందంలో కేంద్రానికి క్లీన్‌చిట్ ఇవ్వడాన్ని వారు సవాల్ చేశారు. రాఫెల్‌పై తీర్పును పునఃవిచారణ జరపాలంటూ ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ వేరుగా మరో పిటిషన్ దాఖలు చేశారు. రూ. 58 కోట్ల రూపాయల రాఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లను డిసెంబర్‌లో సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఏ ప్రేవేటు సంస్థకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చినట్టు ఆధారాలు లేవని కోర్టు తేల్చింది. 2019 జనవరి 2న యశ్వంత్ సిన్హా, అరుణ్‌శౌరి, ప్రశాంత్ భూషణ్ రివ్యూ పిటిషన్లు వేశారు. కాగా రివ్యూ పిటిషన్లతోపాటు జతచేసిన మూడు ప్రివిలేజ్డ్ డాక్యుమెంట్లు రక్షణ శాఖ నుంచి సేకరించి అనధికారికంగా వాడుకున్నారంటూ కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. భారతీయ సాక్ష్యాధారాల చట్టంలోని 123 సెక్షన్ కింద సంబంధిత శాఖ నుంచి అనుమతి లేకుండా అధికారిక పత్రాలు వినియోగించకూడదని కేంద్రం వాదించింది. రివ్యూ పిటిషన్లు అన్నింటినీ కొట్టివేయాలని ప్రభుత్వం అభ్యర్థను తోసిపుచ్చిన కోర్టు ఈనెల 10న విచారణకు అనుమతించింది.