క్రైమ్/లీగల్

గన్‌తో కాల్చుకుని విద్యార్థి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడ్‌మెట్: ఒకవైపు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు మరువకముందే ఐఐటీలో ర్యాంకు వస్తుందో రాదో అన్న భయంతో ఒక విద్యార్థి తండ్రి గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సికిందరాబాద్‌లోని నేరేడ్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నరసింహ తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానా రాష్ట్రం నిదాన గ్రామానికి చెందిన మోహరుద్దీన్ ఆర్మీలో పనిచేసి పదవీ విరమణ పొంది నేరేడ్‌మెట్ పరిధిలోని ఆర్‌కేపురం న్యూ బాలాజీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఆయనకు ముగ్గురు కొడుకులు. చిన్న కుమారుడు సాహెల్ (19) ఇంటర్ పూర్తి చేసి జేఈఈ పరీక్షల కోసం ఒకప్రైవేటు కేంద్రంలో శిక్షణ పొందుతున్నాడు. మొదటినుండి చదువులో కాస్త వెనుకబడి ఉండే సాహెల్‌కి మంగళవారం జేఈఈ పరీక్ష ఫలితాలు వెలువడుతుండడంతో అందులో పాస్ అవుతానో లేదోననే మనోవేదనతో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తన తండ్రికి సంబంధించిన గన్‌ను తీసుకుని బెడ్‌రూంలోకి వెళ్లి నుదుటిపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తుపాకీ శబ్దం విన్న కుటుంబ సభ్యులు లోపలికి వెళ్లి చూడగా సాహెల్ రక్తపు మడుగులో కనిపించడంతో వెంటనే నేరేడ్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.

చిత్రం... ఆత్మహత్య చేసుకున్న సాహెల్