క్రైమ్/లీగల్

సీరియల్ కిల్లర్ శ్రీనివాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో బహిర్గతవౌతున్న వరుస హత్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. నరహంతకుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి చేసిన వరుస హత్యలలో ఇప్పటికే పోలీసులు ముగ్గురు బాలికల మృతదేహాలను బయటకుతీసారు. అలాగే కర్నూల్‌లో శ్రీనివాస్‌రెడ్డిపై వ్యభిచారిని హత్యచేసిన కేసు నమోదైనట్లుగా పోలీసులు చెప్పారు. శ్రావణి హత్యకేసుతో మొదలైన శ్రీనివాస్‌రెడ్డి అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. 2015లో అదృశ్యమైన మైసిరెడ్డిపల్లికి చెందిన తుంగరి కల్పన (11)ను శ్రీనివాస్‌రెడ్డే హత్యచేసి ఉండొచ్చన్న భయాందోళన మంగళవారం నిజమయంది. కల్పనను శ్రీనివాస్‌రెడ్డి అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా విచారణలో వెల్లడించడంతో పోలీసులు మర్రిబావిలో తవ్వకాలు జరిపి కల్పన అస్తికలను వెలికితీసారు. పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించిన అనంతరం శవాన్ని ఫోరెనిక్స్ ల్యాబ్‌కు తరలించారు. శ్రీనివాస్‌రెడ్డి బాలికలను హాజిపూర్ వరకు పలుసార్లు లిఫ్ట్ ఇచ్చి వారిని నమ్మించి వారిపై అత్యాచారానికి పాల్పడిన అనంతరం దారుణంగా హత్యచేసి బావిలో పూడ్చిపెట్టేవాడు. శ్రీనివాస్‌రెడ్డి ఇంట్ల్లో సోదాలు నిర్వహించిన పోలీసులకు ఆయన వాడిన డగ్స్‌కు సంబంధించిన సామాగ్రి కూడా బయటపడ్డాయి. ఈ కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. శ్రావణి బ్యాగ్, టిఫిన్‌బాక్సులు శ్రీనివాస్ వరుస హత్యలను బహిర్గతం చేసాయి.
శ్రీనివాస్‌రెడ్డి ఇంటిని తగులబెట్టిన గ్రామస్థులు
శ్రావణి, మనీషాను అత్యంత దారుణంగా చంపి తన వ్యవసాయ బావిలోనే పూడ్చిపెట్టిన నరహంతకుడు తమ గ్రామానికే చెందిన వ్యక్తిగా తెలుసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ గ్రామస్థుల ఆగ్రహజ్వాలలకు శ్రీనివాస్‌రెడ్డి నివాసం పాక్షికంగా కాలి బూడిదయింది. కాలిన ఇంటి పక్కనే ఉన్న శ్రీనివాస్‌రెడ్డికి చెందిన పాత ఇంటిని పూర్తిగా ధ్వంసం చేసి తమ అక్కసును వెళ్లగక్కారు.
నిందితుడు ఓ సైకో.. మద్యానికి బానిస: సీపీ
సంచలనం సృష్టించిన వరుస హత్య కేసులలో నిందితుడిని అరెస్టు చేసినట్టు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. మంగళవారం నేరేడ్‌మెట్‌లోని కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. యాదాద్రి భువనగరి జిల్లా బొమ్మలరామరాం మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన మర్రి శ్రీనివాస రెడ్డి అలియాస్ హనుమంతు (28) వృత్తిరీత్యా లిఫ్ట్ మెకానిక్. శ్రీనివాస రెడ్డి గతంలో వివిధ కేసులలో జైలుకి వెళ్లి వచ్చినట్టు తెలిపారు. హాజీపూర్‌లో పాఠశాలకు, కళాశాలకు వెళ్తున్న విద్యార్థినులను గుర్తించి బైక్ మీద లిఫ్ట్ ఇస్తానని మాయమాటలు చెప్పి అతని బావి దగ్గరకు తీసుకువెళ్లి మత్తు మందు ఇచ్చి వారిపై అత్యాచారం చేసి హత్య చేసినట్టు తెలిపారు. ఈ నెల 25న పాఠశాలకు వెళ్లి వస్తున్న హజీపూర్ గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని పాముల శ్రావణి (14)ని ఇంటికి వస్తుండగా లిఫ్ట్ ఇస్తానని చెప్పి బావి దగ్గరికి తీసుకువెళ్లి అత్యచారం చేసి హత్య చేసినట్టు పేర్కొన్నారు. బాలిక స్కూల్‌కు వెళ్లి తిరిగి రాకపోవడంతో తండ్రి నర్సింహ.. బొమ్మలరామారం పోలీసులకు ఫిర్యాదు చేశాడని, పోలీసులు ఈ నెల 27న హాజీపూర్‌లోని ఓ బావిలో శ్రావణి హత్యకు గురై ఉందని గుర్తించారని తెలిపారు. నాలుగు స్పెషల్ పోలీసు బృందాలను రంగంలోకి దించిన సీపీ హత్య ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు ప్రారంభించడంతో అసలు విషయం బయటపడినట్టు పేర్కొన్నారు. హాజీపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస రెడ్డి 2015లో వ్యవసాయ బావి వద్దకు కూలీకి వచ్చిన మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో గ్రామస్థులు అతని కొట్టి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. మధ్య పెద్ద మనుషులు కలగజేసుకుని కేసు రాజీ కుదిర్చారని పేర్కొన్నారు. అదే ఏడాది మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన 6వ తరగతి చదువుతున్న కల్పన (11)ను హత్యచారం చేసి హత్య చేసి బ్యాగులో కట్టి బావిలో పడేసినట్టు తెలిపారు. బాలిక తండ్రి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసినట్టు వెల్లడించారు. 2016లో కర్నూలులో నలుగురు స్నేహితులతో కలసి ఓ వేశ్యను తీసుకువచ్చి హత్య చేసి లాడ్జిపైన ఉన్న వాటర్ ట్యాంక్‌లో వేశారని తెలిపారు. కర్నూలు టూ టౌన్ పోలీసులు 2017లో ఐదుగురిని అరెస్టు చేసి జైలుకు పంపించారని తెలిపారు. జైలు నుంచి వచ్చిన తర్వాత శ్రీనివాస రెడ్డి మార్చి 9న హజీపూర్ గ్రామానికి చెందిన కాలేజ్ విద్యార్థిని మనీషా (17)కు కూడా లిఫ్ట్ ఇచ్చి హత్యచారం, హత్య చేసి బావిలో పడేసినట్టు తెలిపారు. మృతురాలి ఆధార్ కార్డు ఆధారంగా మనీషాగా గుర్తించినట్టు చెప్పారు. కల్పన మృతదేహం కోసం గాలింపు చేపటినట్టు తెలిపారు. మనీషా, కల్పన మృతదేహాల డీఎన్‌ఏ పరిక్షలను ఫోరెన్సిక్ వైద్యులకు పంపించినట్టు తెలిపారు. నిందితుడు మద్యానికి బానిసై సైకోగా ప్రవర్తించి నేరాలు చేసినట్టు వెల్లడించారు. నిందితున్న అరెస్టు చేసి అతని వద్ద నుండి హోండా షైన్ బైక్, రెండు సెల్‌ఫోన్‌లు, లిఫ్ట్ మెకానిక్ సామాన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించిన అడిషనల్ డీసీ జే.సురేందర్ రెడ్డి, భువనగిరి ఏసీపీ ఎన్.్భజంగ రావు, సీఐలు టీ.రవి కుమార్, బీ.రాజు, ఏ.రాములు, ఎం.శ్రీ్ధర్ రెడ్డి, రఘువీరారెడ్డి, కిష్టయ్య, సురేందర్ రెడ్డిను సీపీ అభినందించారు.

చిత్రం... నిందితుడు మర్రి శ్రీనివాస రెడ్డి