క్రైమ్/లీగల్

ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటిక్యాల, ఏప్రిల్ 30: జమ్ములమ్మ దైవదర్శనానికి వెళ్తూ అనంతలోకాలకు తరలిపోయన సంఘటన గద్వాల జిల్లా ఇటిక్యాల మండల పరిధిలోని కోదండాపురం జింకలపల్లి స్టేజి మధ్యలో 44వ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఇటిక్యాల ఎస్సై సీహెచ్ రాజు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మానవపాడు మండలం చిన్న పోతులపాడు గ్రామానికి చెందిన నీలుడు కుటుంబం బంధువులతో కలసి తమ స్వంత ట్రాక్టర్ ఏపీ డబ్ల్యూ 8121 నంబర్ ట్రాక్టర్‌లో దాదాపు 25 మంది కలసి గద్వాల ప్రాంతాంలోని జమ్మిచేడు జమ్ములమ్మ అలయానికి మొక్కు తీర్చుకోవడానికి సోమవారం రాత్రి బయలు దేరారు. మార్గమధ్యంలో కోదండాపురం, జింకలపల్లి స్టేజి మద్యలో 44వ జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో డ్రైవర్ నీలుడు భార్య పార్వతమ్మ (38), కర్నూలు పట్టణం రాజీవ్‌గృహకల్ప నివాసి మల్లికార్జున్ (40), అయిజ మండంలోని మేడికొండ గ్రామానికి చెందిన శైలజ(9)లు అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. అదే విధంగా 18 మందికి గాయాలయ్యాయన్నారు. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ అసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. స్వల్పగాయాలైన వారిని చిక్సిత నిమిత్తం గద్వాల ప్రభుత్వ అసుపత్రికి తరలించి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని గద్వాల డీఎస్పీ షాకీర్‌హుస్సేన్ చేరుకొని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకొని మృతదేహాలను గద్వాల ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు డీఎస్పీ తెలిపారు.
చిత్రాలు.. ప్రమాదంలో మృతి చెందిన పార్వతమ్మ, మల్లికార్జున్, శైలజ