క్రైమ్/లీగల్

బలవంతపు అవయవదానాల సంఘటనపై హాస్పిటల్ యాజమాన్యంపై కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు రూరల్, ఏప్రిల్ 30: నగరంలోని సింహపురి హాస్పటల్‌లో బలవంతంగా అవయవాలు తీసుకుంటున్నారని జిల్లా జాయింట్ కలెక్టర్ వెట్రి సెల్వి విచారణలో తేలింది. ఈనేపథ్యంలో ఆ హాస్పటల్ యాజమాన్యంపై కేసు నమోదు చేయవల్సిందిగా నెల్లూరు రూరల్ పోలీసులకు ఆమె మంగళవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. జేసీ ఫిర్యాదు మేరకు సింహపురి హాస్పటల్ యాజమాన్యంపై ఛీటింగ్, అక్రమ అవయవాల తొలగింపు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసినట్లు రూరల్ సీఐ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఉద్దెపుగుంట గ్రామానికి చెందిన ఏకోలు శ్రీనివాసులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా చికిత్స నిమిత్తం అతడిని సింహపురి హాస్పటల్‌కు తరలించారు. అయితే ఒకరోజు చికిత్స చేసిన హాస్పటల్ యాజమాన్యం మరుసటిరోజు బ్రెయిన్ డెడ్ అయిందని తెలపడంతో కుటుంబ సభ్యులు బాధితుడిని ఇంటికి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈక్రమంలో మృతుని కుటుంబ సభ్యులు నిరక్షరాస్యులు కావడంతో వారిపై ఒత్తిడి తీసుకొచ్చి అవయవాలను హాస్పటల్ యాజమాన్యం తీసుకున్నట్లు మృతుడి కుటుంబ సభ్యులు జిల్లా జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రెండు రోజులపాటు చికిత్స చేసినందుకు గాను ఆ బిల్లులను చెల్లించవల్సిన అవసరం లేదని, అవయవాలు ఇస్తే సరిపోతుందని హాస్పటల్ యాజమాన్యం ఒత్తిడి తెచ్చారని మృతుని భార్య జేసీకి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు జిల్లాస్థాయి అధికారులు విచారణ చేపట్టి వాస్తవాలను బయటకుతీయడంతో కేసు నమోదు చేయాలని జేసీ వెట్రిసెల్వి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు ఒక్క శ్రీనివాసులు సంఘటనకు సంబంధించినదా లేక గతంలో సింహపురి హాస్పటల్‌లో జరిగిన మరికొన్ని అవయవదానాలపై కూడా విచారణ చేపడతారా అన్నది వేచి చూడాల్సిందే.