క్రైమ్/లీగల్

సీబీఐ విచారణకు సుజనాచౌదరి హాజరుకావాల్సిందే: హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 30: రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి సీబీఐ విచారణకు హాజరుకావల్సిందేనంటూ తెలంగాణ హైకోర్టు మంగళవారం నాడు స్పష్టం చేసింది. బెస్టు అండ్ క్రాంప్టన్ కేసులో విచారణకు రావాలంటూ సీబీఐ పంపిన నోటీసులను సుజనా చౌదరి హైకోర్టులో సవాల్ చేశారు. సుజనా దాఖలు చేసిన పిటీషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అయితే సుజనాకు ఊరట కలిగించేలా న్యాయమూర్తులు ఈ సందర్భంగా కొన్ని సూచనలు చేశారు. బెంగలూరులోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలంటూ సుజనాచౌదరిని ఆదేశించిన హైకోర్కుట మే 27,28 తేదీల్లో విచారణ పూర్తి చేయాలని పేర్కొంది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకూ మాత్రమే ఆయనను విచారించాలని, మధ్యలో మధ్యాహ్న భోజనానికి తగినంత విరామం ఇవ్వాలని సూచించింది. ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లోనూ సుజనా చౌదరిని అరెస్టు చేయవద్దని, అలాగే శారీరకంగా హింసించడం లాంటి చర్యలకు పాల్పడవద్దని కూడా హైకోర్టు సీబీఐకి స్పష్టం చేసింది.