క్రైమ్/లీగల్

నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొమ్మలరామారం : యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని మైసిరెడ్డిపల్లి గ్రామశివారులో మంగళవారం ఆర్ధరాత్రి జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రమాద స్థలంలోనే మృతి చెందగా మరొక విద్యార్థి తీవ్ర గాయాలతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించగా మృతి చెందాడు. మృతిచెందిన విద్యార్థులు హైద్రాబాద్‌కు చెందిన స్పూర్తి (22), ప్రణీత (22), చైతన్య (23) చికిత్సపొందుతూ మృతిచెందిన విద్యార్థి వినీత్‌రెడ్డి (23)లుగా పోలీసులు గుర్తించారు. తీవ్రగాయాలైన మనీష్‌రెడ్డి కేర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లుగా పోలీసులు తెలియజేసారు. సంఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే.. శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనలియర్ ఇంజీనీరింగ్ పూర్తయన సందర్భంగా 14 మంది విద్యార్థులు ఆరుగురు యువతులతోపాటు 8మంది యువకులు వీడ్కోలు పార్టీ చేసుకునేందుకు బొమ్మలరామారం మండల కేంద్రంలోని బృందావన్ ఫాంహౌస్‌ను ఎంచుకున్నారు. అందులో భాగంగా సాయంత్రం ఫాంహౌస్‌కు చేరుకున్న వీరు మొత్తంగా విందు, వినోదాలలోగడిపి మద్యం మత్తులో తిరిగి తమ గృహాలకు వెళ్లేందుకు ఫాంహౌస్ నుంచి ఐదుగురు విద్యార్థులు ఒకకారులో బయలుదేరారు. మద్యం మత్తులో ఉండి అతివేగంగా కారునడుపుతూ పది నిమిషాలు ప్రయాణించిన అనంతరం అదుపుతప్పి కారు బోల్తా కొట్టడంతో ప్రమాదానికి గురయ్యారు. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఇద్దరు యువతులు, ఒక యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా తీవ్రగాయాలైన మిగతా ఇద్దరిని హైద్రాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికత్స పొందుతూ ఆస్పత్రిలో మరో విద్యార్థి మృతి చెందగా మరో విద్యార్థి మనీష్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. విద్యార్థుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేపడుతున్నట్లుగా సీఐ సురేందర్‌రెడ్డి తెలిపారు.
అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిన
ఫాంహౌస్‌లు, రిసార్టులు...
రాష్ట్ర రాజదాని హైద్రాబాద్‌కు సమీపంలోనున్న బొమ్మలరామారం మండలంలోని ఫాంహౌస్‌లు, రిసార్టులు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయని ప్రజలు వాపోతున్నారు. ఫాంహౌస్‌లు, రిసార్టులలో వీకెండ్ పార్టీలలో భాగంగా హుక్కా, రేవ్ పార్టీలు, డిజే సౌండ్‌సిస్టంతో డాన్స్ పార్టీలకు నిలయంగా మారాయి. మత్తుకు లోనయిన యువత వారాంతపు సెలవులలో ఫాంహౌస్‌లలో పార్టీలు నిత్యకృత్యమయ్యాయి.
రిసార్టులు, ఫాంహౌస్‌లపై పోలీసుల నిఘా లేకపోవడంతో వాటి యజమానులు అసాంఘిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు నిఘా పెంచకపోతే యువత పెడదారి పట్టి మరిన్ని అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకునే ప్రమాదముందని ప్రజాసంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ నారాయణరెడ్డి
రాచకొండ కమిషనరేట్ భువనగిరి జోన్ డీసీపీ నారాయణరెడ్డి బుధవారం సంఘటనా స్థలాన్ని, విద్యార్థులు బసచేసిన ఫాంహౌస్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఫాంహౌస్, రిసార్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

చిత్రాలు.. ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు, *రిసార్ట్‌లో విద్యార్థులు వాడిన హుక్కా పరికరం, బీరుబాటిళ్లు,
* ప్రమాదంలో చెల్లాచెదురుగా పడి మరణించిన, తీవ్రంగా గాయపడ్డ విద్యార్థులు