క్రైమ్/లీగల్

కూతురు కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 1: హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నూతి రామమోహనరావు మనుమరాలిని ఆయన కోడలు సింధుశర్మకు అప్పగించే వ్యవహారం హైకోర్టుకు చేరింది. పెద్దకుమార్తె రిషిక కోసం రామమోహనరావు కోడలు సింథుశర్మ హైకోర్టును ఆశ్రయించారు. కుమార్తె ఆచూకీ తెలపాలంటూ సింధుశర్మ హెబియస్ కార్పస్ పిటీషన్‌ను దాఖలు చేశారు. ఆమె దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటీషన్‌పై హైకోర్టు బుధవారం నాడు విచారణ జరిపింది. గురువారం నాడు రిషికతో పాటు ఆమె తల్లిదండ్రులు సింధు శర్మ, వశిష్టలను కూడా తమ ఎదుట హాజరుపరచాలని హైదరాబాద్ సెంట్రల్‌జోన్ డీసీపీని హైకోర్టు ఆదేశించింది. భర్త , అత్తమామల నుండి తమ పిల్లలను పొందేందుకు సింధుశర్మ గత నాలుగు రోజులుగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమెకు చిన్న కుమార్తెను అప్పగించారు. ఆదివారం ఉదయం నుండి రామమోహనరావు ఇంటి బయట సింధు శర్మ సహా అమెకు మద్దతుగా మహిళా సంఘాలు ధర్నా చేశాయి.దీంతో సాయంత్రం చిన్నపాప శ్రీవిద్యను తల్లి సింధుశర్మకు పోలీసులు అప్పగించారు. పెద్ద కుమార్తె రిషిక అప్పగింత వ్యవహారంలో సోమవారం నాడు నాంపల్లిలోని భరోసా కేంద్రం వద్ద వివాదం చెలరేగింది. మూడున్నరేళ్ల తన పెద్ద కుమార్తెను అప్పగించే వరకూ తన ఉద్యమం కొనసాగుతుందని, ఆ వ్యవహారం తేలేంత వరకూ తాను విడాకుల అంశంపై ఏమీ మాట్లాడబోనని చెప్పిన సింధుశర్మ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టుకు వేసవి సెలవులు
మే 31 వ తేదీ వరకూ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. వేసవి సెలవుల్లో ప్రత్యేక కోర్టు పనిచేస్తుంది. ఈ కోర్టు 8,15,22,29 తేదీల్లో పనిచేస్తుందని హైకోర్టు అధికారులు తెలిపారు. వెకేషన్ ఆఫీసర్లను కూడా నియమించారు. మే 2 నుండి 16 వరకూ వెకేషన్ ఆఫీసర్లుగా డిప్యుటీ రిజిస్ట్రార్ కే శ్రీనివాసరావు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎన్ పురుషోత్తంరెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ టి రంగబాబు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ టీ కృష్ణకుమార్, మే 17 నుండి 31 వరకూ డిప్యుటీ రిజిస్ట్రార్ డీ రాజేంద్రకుమార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎం రమణ కృష్ణ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కే ప్రభాకర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ పీ సత్యకళ వెకేషన్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు. ప్రత్యేక కోర్టు హెబియస్ కార్పస్ కేసులు, యాంటిసిపేటరీ బెయిల్ కేసులు, బెయిల్ అప్లికేషన్లు తదితర అంశాలను పర్యవేక్షిస్తుంది.