క్రైమ్/లీగల్

ఫరూఖ్‌నగర్‌లో కార్డన్ సెర్చ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, మే 1: ప్రజల శ్రేయస్సుకు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి వివరించారు. బుధవారం తెల్లవారుఝామున రెండు గంటల సమయంలో శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి, షాద్‌నగర్ ఏసీపీ సురేందర్, స్థానిక సీఐ శ్రీ్ధర్ కుమార్ ఆధ్వర్యంలో షాద్‌నగర్ పురపాలక సంఘం పరిధిలోని ఫరూఖ్‌నగర్ ప్రాంతంలోని పాత ఆశియానా హోటల్ వెనుక ప్రాంతంలో 400 ఇళ్లను తనిఖీ చేశారు. పాత జాతీయ రహదారి ఎన్‌హెచ్-7 నుంచి ఫరూఖ్‌నగర్ ప్రాంతం వరకు ఉన్న ఇళ్లను ఒక ఏసీపీ, ఇద్దరు సీఐలు, ఎనిమిది మంది ఎస్‌ఐలు, 10మంది ఏఎస్‌ఐలు, ఆరు మంది హెచ్‌సీలు, 64మంది కానిస్టేబుళ్లు, ఎనిమిది మంది మహిళా కానిస్టేబుళ్లు, 15మంది ఏఆర్, 10మంది స్పెషల్ పార్టీ పోలీసులు కార్డెన్ సెర్చ్‌లో పాల్గొని డోర్ టూ డోర్ తనిఖీలు చేసి నివాసం ఉంటున్న వారి ధ్రువపత్రాలను పరిశీలించారు. వ్యక్తులతోపాటు వివిధ రకాల వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. పత్రాలు లేని 18ద్విచక్ర వాహనాలు, ఒక వ్యాన్, రెండు ఆటోలను స్వాధీనం చేసుకోవడంతోపాటు పలువురి అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ షాద్‌నగర్ పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇతర రాష్ట్రాల నుంచి జీవనోపాధి కోసం ఎక్కువగా వలసలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ప్రజల్లో పోలీసులపై ఉన్న భయాన్ని తొలగించడంతోపాటు వారి మేలు కోసమే తాము కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు వివరించారు. ఇతర ప్రాంతాల నుండి ఇక్కడి వచ్చి ఆశ్రయం పొందుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఇంటిని అద్దెకు ఇచ్చే సమయంలో వారికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించడంతోపాటు ఆధార్ కార్డు, పని వివరాలు తెలుసుకున్న తరువాతే ఇల్లు అద్దెకు ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో షాద్‌నగర్ ఏసీపీ సురేందర్, ఎస్‌ఐ విజయభాస్కర్ పాల్గొన్నారు.