క్రైమ్/లీగల్

ప్రమాదవశాత్తు పడి యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, మే 1: ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడి యువకుడు మృతిచెందిన సంఘటన దుందిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బీహార్‌కు చెందిన ఎండీ శమీమ్ (24) కూలీ పనులు చేస్తుంటాడు. గండిమైసమ్మలోని ఎండీ యూనస్ పంచర్ దుకాణంలో కూలీగా పనిచేస్తాడు. బుధవారం ఉదయం నిద్ర లేచిన శమీమ్ ఇనుప వాటర్ డ్రమ్‌పై నిలబడి సబ్బు తీసుకునేందుకు వెతుకుతున్నాడు. కాలు జారి కిందపడిపోయాడు. డ్రమ్ పై నుంచి కింద పడిపోయిన శమీమ్ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.