క్రైమ్/లీగల్

పెద్దకుమార్తెనూ అప్పగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నూతి రామమోహనరావు కోడలు సింధు శర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింఘ్ చౌహాన్ నేతృత్వంలోని బెంచ్ పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆమె పెద్ద కుమార్తెను తల్లికి అప్పగించాలని సూచించింది. అయితే వారంలో రెండు రోజులు తండ్రి వద్ద బిడ్డను ఉంచాలని పేర్కొంది. తదుపరి విచారణను జూన్ 4వ తేదీకి వాయిదా వేసింది. తన కుమార్తెలను అప్పగించాలని సింధుశర్మ చేసిన ఉద్యమంతో ఏడాదిన్నర వయస్సున్న చిన్న కుమార్తె శ్రీవిద్యను అప్పగించగా, పెద్ద కుమార్తె రిషితను సైతం తనకు అప్పగించాలని కోరుతూ ఆమె హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. దానిపై స్పందించిన హైకోర్టు తల్లి, తండ్రి, బిడ్డను కోర్టులో హాజరుపరచాలని బుధవారం నాడిచ్చిన ఆదేశాలకు స్పందించి ముగ్గురూ గురువారం కోర్టులో హాజరయ్యారు. సుమారు గంటపాటు వాదనలు విన్న ధర్మాసనం కొన్ని షరతులతో బిడ్డను తల్లికి అప్పగించాలని ఆదేశించింది. ఐదు రోజుల పాటు తల్లి వద్ద, రెండు రోజుల పాటు తండ్రి వద్ద చిన్నారిని ఉంచాలని ఆదేశాల్లో పేర్కొంది. శుక్రవారం సాయంత్రం పెద్దకుమార్తెను తీసుకువెళ్లి సోమవారం ఉదయం అప్పగించాలని తండ్రి వశిష్టకు సూచించింది. ఈ ప్రయ్రను తదుపరి విచారణ జరిగే జూన్ 4వ తేదీ వరకూ కొనసాగించాలని పేర్కొంది. ఈ సందర్భంగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి పలు వ్యాఖ్యలు చేశారు. తల్లిదండ్రులు పిల్లలకు మంచి బంగారు భవిష్యత్‌కు బాట వేయాలని, అంతే తప్ప వారు పంతాలకు పోయి పోట్లాడుకుంటే అది పిల్లలపై ప్రభావం చూపుతుందని అపుడు పశ్చాత్తాపం పడినా లాభం ఉండదని, ఇద్దరూ ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రావాలని హైకోర్టు పేర్కొంది. రిషితను చూసిన న్యాయమూర్తులు నువ్వు ఎవరి వద్ద ఉండటానికి ఇష్టపడతావు అని ప్రశ్నించగా, బోరున విలపించిన రిషిత తాను తల్లిదగ్గరే ఉంటానని పేర్కొంది. కాగా ఇప్పటికే మాజీ న్యాయమూర్తి జస్టిస్ నూతి రామమోహనరావు, ఆయన భార్య దుర్గా జయలక్ష్మీ, కుమారుడు వశిష్టపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది.

చిత్రం...చిన్న కుమార్తె శ్రీవిద్యతో సింధు శర్మ