క్రైమ్/లీగల్

ఆగని ఆత్మహత్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్మెట, మే 2: ఇంటర్ ప్రథమ సంవత్సరంలో మూడు సబ్జెక్టులు ఫెయల్ అయ్యానని ఆత్మస్థైర్యం కోల్పోయిన ఓ విద్యార్థి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జనగామ జిల్లా తరిగొప్పుల మండలం నర్సాపూర్ గ్రామంలో గురువారం జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం... నర్సాపూర్ గ్రామానికి చెందిన నీల రాజు-కనకమ్మల ఏకైక కుమారుడు నీల అరవింద్ (17) నర్మెట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీఈసీ ప్రథమ సంవత్సరం చదివాడు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో మూడు సబ్జెక్ట్‌లు ఫెయల్ అయ్యానని ఆత్మస్థైర్యం కోల్పోయిన అతను ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతడు ఉరివేసుకోగా, సుమారు ఐదుగంటల అనంతరం గ్రామస్థులు ఇంట్లో మృతదేహాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తమ కొడుకు వారం రోజులుగా ఏదో బాధతో బెంగగా ఉన్నట్లు గమనిస్తున్నామని వారు రోదిస్తూ తెలిపారు. పరీక్షల్లో ఫెయిల్ అయినా పర్వాలేదు అని చెప్పామని, మరోసారి పరీక్షలు రాపిస్తామని నచ్చజెప్పామన్నారు. అయినప్పటికీ తమ కొడుకు ప్రాణాలు తీసుకున్నాడని విలపించారు. సాయంత్రం పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని జనగామ మార్చురీకి తరలించారు.

చిత్రం...ఉరేసుకున్న అరవింద్