క్రైమ్/లీగల్

ఎయిర్ ఫోర్స్ జవాన్ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 2: భారత వైమానిక దళంలో జవాన్‌గా పని చేస్తున్న బూర్ల వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. చండీగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలులో దుల్‌పూర్-ఆగ్రా క్యాంట్ రైల్వే స్టేషన్ల మధ్య బూర్ల వెంకటేష్ సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగిన రైలు వద్దకు చేరుకున్న పోలీసులు, వైమానిక దళ ఉన్నతాధికారులు ఆత్మహత్యపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే జవాను మృతికి ఇంకా కారణాలు తెలియలేదు. బూర్ల వెంకటేష్ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవాడిగా రైల్వే పోలీసులు గుర్తించారు.