క్రైమ్/లీగల్

యాదాద్రిపై అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, మే 3: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొండపై భక్తుల సౌకర్యార్ధం వేసిన చలువ పందిళ్లకు శుక్రవారం ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి. దేవాలయ సిబ్బంది పాత పైళ్లను, చెత్తను దగ్ధం చేస్తున్న క్రమంలో కొన్ని నిప్పురవ్వలు స్టాల్స్‌పైన వేసిన చలువ పందిళ్లకు అంటుకుని మంటలు రేగాయి. ఒక్కసారిగా మంటలు రేగడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. ఫైరింజన్ వచ్చి మంటలు ఆర్పగా అప్పటికే పందిళ్లు దగ్ధమయ్యాయి. ఫైరింజన్ వచ్చేలోగా స్టాల్స్ నిర్వాహకులు, భక్తులు సైతం అందుబాటులో ఉన్న నీటితో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. మరింత పెద్ద ప్రమాదం జరుగకుండా పందిళ్ల వరకే దగ్ధమవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
యాదాద్రి కొండపై భద్రతపై సమీక్ష
యాదాద్రి కొండపై భద్రత ఏర్పాట్లపై శుక్రవారం దేవస్థాన కార్యాలయంలో డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీలు కృష్ణయ్య, మనోహర్‌రెడ్డిలు, ఈవో గీత సమీక్ష నిర్వహించారు. సీసీ కెమేరాల ఏర్పాటు, చెక్‌పోస్టుల తనిఖీ కేంద్రాలు, సిబ్బంది నియామకం తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో సీఐలు ఆంజనేయులు, నర్సింహారావులు పాల్గొన్నారు.