క్రైమ్/లీగల్

అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠా సభ్యుడి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, మే 3: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలకేంద్రంలో మూడు పవన్‌కుమార్ అనే అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠా సభ్యుడిని శుక్రవారం అరెస్ట్ చేసి రూ. 6.40 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రమైన మహబూబాబాద్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన ఈ కేసు వివరాలను తెలిపారు. కేసముద్రం పోలీసులు స్థానిక అంబేద్కర్ సెంటర్‌లో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా రెండు తెల్ల సంచులతో కనిపించారని పోలీస్ వారు వారి వద్దకు తనిఖీ చేయడానికి వెళ్తుండగా ఆ వ్యక్తులు రెండు సంచులను వదిలి పారిపోయారన్నారు. పారిపోతున్న వారిని కొంతదూరం వెంబడించిన పోలీసులు ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగిందన్నారు. అతన్ని విచారించగా తన పేరు మూడు పవన్‌కుమార్ అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం మూడు తండాకు చెందిన వ్యక్తినని తెలిపారు. కుటుంబ పోషనార్ధం పవన్‌కుమార్ ఇల్లందులో ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తాడని ఎస్పీ చెప్పారు. ఆటో ద్వారా వచ్చే డబ్బులు తన జల్సాలకు సరిపోవడం లేదనే ఆలోచనతో గత కొన్ని రోజుల కిందట బావ వరుస అయిన భూక్య చంద్రసింగ్‌ను కలసి విషయం చెప్పుకున్నాడు. వీరు కొంతకాలం నుండి విశాఖపట్నం చుట్టూ ప్రక్కల ప్రాంతాలలో గుర్తుతెలియని వ్యక్తుల నుండి గంజాయి తక్కువ ధరకు కొని ఢిల్లీ చుట్టూప్రక్కల ప్రాంతాలలో ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నట్లు తెలిపారు. ఐదు రోజుల క్రిందట పవన్, చంద్రసింగ్‌లు కలసి విశాఖపట్నం వెళ్లి 24కిలోల గంజాయిని కిలో వెయ్యి చొప్పున పవన్ కొన్నాడు. అదే ధరకు చంద్రసింగ్ 40కిలోలు కొన్నాడు. అట్టి గంజాయిని వేరు వేరుగా రెండు సంచులలో ప్యాక్ చేసుకొని భద్రాచలం మీదుగా బస్సులో మహబూబాబాద్‌కు చేరుకొని అక్కడి నుండి తిరిగి బస్సులో కేసముద్రం చేరుకొని రైలు ఎక్కి వరంగల్‌కు వెళుదామని అంబేద్కర్‌సెంటర్‌లో రైల్వేస్టేషన్ కి వెళ్తున్న క్రమంలో పోలీసులకు పట్టుబడ్డారు. భూక్య చంద్రాసింగ్ తప్పించుకొని పారిపోయాడన్నారు. ఇట్టి గంజాయి విలువ రూ.6,40,000 లక్షలు ఉంటుందని ఈ ముఠా సభ్యుడిని పట్టుకున్న కేసముద్రం ఎస్సై సతీష్, వారి సిబ్బంది, మానుకోట రూరల్ సీఐ వెంకటరత్నంలను అభినందించారు.