క్రైమ్/లీగల్

పెనువిషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యలమంచిలి, మార్చి 28:కుటుంబ పోషణ కోసం పొట్ట చేతపట్టుకుని జిల్లాల ఎల్లలు దాటివచ్చిన ఓ వృద్ధుడు తిరిగి తన సొంతవూరు వెళ్తూ అనంత లోకాలకు చేరుకున్నాడు. పోడూరు మండలం జగన్నాథపురం వద్ద బుధవారం ఉదయం ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదంలో మృతులు ముగ్గురిలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మోతుకూరి మల్లికార్జునరావు(63) విషాద ఉదంతమిది. ఈ ప్రమాదంలో అతని కుమారుడు నాంచారయ్య సైతం తీవ్రంగా గాయపడ్డాడు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మల్లికార్జునరావు ప్రతి ఏటా మార్టేరులో జరిగే వెంకటేశ్వరస్వామి ఉత్సవాల్లో పాస్టిక్ బొమ్మలు దుకాణం నిర్వహిస్తుంటాడు. వృద్ధాప్యం మీద పడడంతో ఈ ఏడాది కుమారుడు నాంచారయ్యతో కలిసి మార్టేరు వచ్చాడు. ఉత్సవాలు ముగియడంతో తెనాలికి తిరుగుప్రయాణమయ్యాడు. బుధవారం ఉదయమే పాలకొల్లు రైల్వే స్టేషనుకు వెళ్లడానికి కుమారునితో మార్టేరులో ఆటో ఎక్కాడు. కొంత దూరం వెళ్లేసరికే ప్రమాదంలో మృత్యువాతపడ్డాడు. అలాగే మార్టేరులో ఉత్సవాలను తిలకించడానికి వచ్చిన కృష్ణాజిల్లా మూలలంకకు చెందిన ఈతకోట నాగరాజు (36) కూడా ఇదే ఆటో ఎక్కి మృత్యువాత పడ్డాడు. ఇక పండితవిల్లూరు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ దొంగ వెంకటేశ్వరరావు (40) కూడా ఈ ప్రమాదంలో మృతిచెందాడు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నాటిన శ్రీనివాసరావు, భాగ్యలక్ష్మి దంపతులు, విశ్వనాథపల్లి వెంకటేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉండటంతో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పాలకొల్లు వెళుతున్న ఆటోను పాలకొల్లు నుండి ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని లారీ ఢీకొని వెళ్లిపోయింది. ఈ ప్రమాద తీవ్రతకు ఆటో తునాతునకలై పక్కనే ఉన్న పంటకాలువలో పడిపోయిందంటే ప్రమాద తీవ్రత అర్థంచేసుకోవచ్చు. పాలకొల్లు సీఐ రజనీకుమార్ ఆధ్వర్యంలో పోడోరు ఎస్సై రామకృష్ణ కేసు దర్యాప్తుచేస్తున్నారు.