క్రైమ్/లీగల్

క్వారీ అనుమతులకు రూ. 50 వేల లంచం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడెంకొత్తవీధి, మార్చి 28: విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి మండల తహశీల్దార్ తమర్బ చిరంజీవి పడాల్ బుధవారం ఎసీబీకి చిక్కారు. నల్లరాయి క్వారీ అనుమతులకు సంబంధించి 50 వేలు లంచం తీసుకుంటూ ఎసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ మేరకు అతన్ని గురువారం విశాఖపట్నం ఎసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. ఆయన అందించిన వివరాల ప్రకారం గూడెంకొత్తవీధి మండలంలోని ఏబులం సర్వే నెంబర్ 13లోని నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నల్లరాయిని వెలికి తీసేందుకు కొయ్యూరు మండలం డౌనూరుకు చెందిన మాజీ సర్పంచ్ రామకృష్ణరాజు అనకాపల్లి గనుల శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో మండల రెవెన్యూ అధికారులకు ఎన్‌వోసీ నిమిత్తం పంపించారు. ఈ ధృవీకరణ పత్రం కావాలని గనుల శాఖ అధికారులకు తెలపడంతో ఈమేరకు ఈనెల 19న రామకృష్ణరాజు తహశీల్దార్ చిరంజీవి పడాల్ వద్దకు వచ్చాడు. అనుమతులకు సంబంధించి 15 లక్షలు కావాలని డిమాండ్ చేసాడు. దీంతో రామకృష్ణరాజు 10 లక్షలు ఇస్తానని ముందుగా 50వేలు అడ్వాన్స్ ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందుకు తహశీల్దార్ అంగీకరించడంతో రామకృష్ణరాజు విశాఖపట్నంలో ఎసీబీ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో ప్రణాళిక ప్రకారం బుధవారం ఎసీబీ డీ ఎస్పీ రామకృష్ణ ప్రసాద్, ఇన్స్‌పెక్టర్ గపూర్, గణేష్‌లు తహశీల్దార్ కార్యాలయం వద్దమాటు వేసారు. ఫిర్యాదు దారుడు రామకృష్ణరాజు బుధవారం తహశీల్దార్‌ను కలిసాడు. డబ్బులు తీసుకువచ్చావా అని తహశీల్దార్ రామకృష్ణరాజు అడుగగా తీసుకువచ్చానని సమాధానం చెప్పడంతో తన డ్రైవర్ పూజారి గణేష్‌కు ఇవ్వాలని సూచించాడు. ఈ సమయంలోనే మాటు వేసిన ఏసీబీ అధికారులు వారిని పట్టుకుని అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గణేష్ లెప్ట్ హ్యాండ్, లెప్ట్ ఫ్యాకెట్ నిర్ధారణైంది. ఇతనిపై ప్రొసిడింగ్స్ జరుగుతున్నాయని, అనంతరం అతన్ని విశాఖపట్నం ఎసీబీ స్పెషల్ జడ్జి ముందు హాజరుపరుస్తామని ఎసీబీ డీ ఎస్పీ రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. ఇదిలా ఉండగా ఆర్‌ఐ స్థాయి నుండి తహశీల్దార్ స్థాయికి వచ్చిన చిరంజీవి పడాల్ గతంలో పలు ప్రాంతాల్లో పని చేసారు. ఆ సమయంలో కూడా పెద్ద ఎత్తున లంచాలకు పాల్పడుతున్నట్లు ఎసీబీ అధికారులకు అనేక ఫిర్యాదులు అందాయి . గతంలో మూడు పర్యాయాలు మాటువేసినప్పటికీ తప్పించుకున్నాడు. దీంతో పక్కా ప్రణాళికలతో బుధవారం తన డ్రైవర్ ద్వారా లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. తహశీల్దార్‌ను , డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, గురువారం ఎసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఎసీబీ అధికారులు తెలిపారు.