క్రైమ్/లీగల్

ఏసీబీకి చిక్కిన వీఆర్‌వో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జన్నారం,మార్చి 28: లం చం తీసుకుంటూ గ్రామ విఆర్‌ఓ ఏసీబీ అధి కారు లకు పట్టుబడ్డాడు. మంచి ర్యాల జిల్లా జన్నారం మం డలం కలమడుగు గ్రామ రెవెన్యూ అధికారి మహ్మద్ ఇక్బాల్ ఓ రైతు నుండి విరాసత్ పేరుమార్పిడి కోసం రూ.4వేలు లంచం తీసుకుం టూ బుధవారం సాయంత్రం రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే కలమడుగు విఆర్‌వో మహ్మద్ ఇక్బాల్ భూదస్త్రాల ప్రక్షాళనలో భాగంగా కలమడుగుకు చెందిన బండ సాయిలు తన మనువలు అయిన బండ దయాకర్, బండ రాజారావు పేరిట విరాసత్ పేరుమార్పిడి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే లంచం ఇస్తేనే విరాసత్ చేస్తానని కొద్దిరోజులుగా విఆర్‌వో మహ్మద్ ఇక్బాల్ వేధించడంతో గత్యంతరం లేక దయాకర్, రాజారావులు కరీంనగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బుధవారం సాయంత్రం జన్నారంలో నివాసం ఉంటున్న కలమడు గు విఆర్‌వో ఇక్బాల్ ఇంటికి బండ దయాకర్ వచ్చి రూ.4వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ కిరణ్ కుమార్, సీఐలు వేణుగోపాల్, రాము తదితరులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకొని ఇక్బాల్‌ను అరెస్ట్ చేశారు. 2013లో నెనె్నల మండలం మెట్‌పల్లి వి ఆర్‌వోగా పనిచేస్తున్న సమయంలో ఇక్బాల్ ఓ రైతు నుండి రూ.6వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కగా కేసు విచారణలో భాగంగా బుధవారం కరీంనగర్ ఏసీబీ కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. కోర్టుకు హాజరుకాకుండా బుధవారం జన్నారంలోనే ఉన్న ఇక్బాల్‌ను ఏసీబీ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. బండ దయాకర్ ఫిర్యాదు మేరకు రిమాండ్‌కు తరలించి కేసు దర్యాప్తుచేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.

చిత్రం..పట్టుబడ్డ వీఆర్‌వో మహ్మద్ ఇక్బాల్