క్రైమ్/లీగల్

యూజీ సప్లిమెంటరీ పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 28: గత ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జరిగిన యుజి (బిఎస్సీ) పరీక్షల్లో ఆర్‌కె డిగ్రీ కాలేజీలో ఇతర పరీక్షా కేంద్రాలకు చెందిన 104 మందిని పరీక్ష రాసేందుకు అనుమతించడంతో మాల్‌ప్రాక్టీస్ జరిగినట్లు కేసు నమోదైంది. ఇలా ఇతర కేంద్రాల్లోని వారిని ఈ కాలేజీలో పరీక్షలు రాయించడం ద్వారా భారీగా సొమ్ములు ముట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ క్యాంపస్ పరీక్షల కంట్రోలర్ ప్రొ.కుమార్ మొలుగరం చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసును సిసిఎస్ బృందం దర్యాప్తు చేపట్టి ఈ మాల్‌ప్రాక్టీస్‌కు కారణమైన జి.స్వర్ణలతను ఈ నెల 23న అరెస్టు చేసినట్లు డిసిపి తెలిపారు. నిందితురాలిని కోర్టుకు హాజరు పర్చగా రిమాండ్ విధించింది.