క్రైమ్/లీగల్

గోదాములో భారీగా చెలరేగిన మంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెహిదీపట్నం, మే 13: ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని ఫర్నిచర్ గోదాము కాలి బూడిదైన సంఘటన టప్పాఛబుత్రా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సోమవారం ఉదయం సుమారు పదిన్నర గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్‌తో ఫర్నిచర్ గోదాములో భారీ అగ్ని ప్రమాదంతో పెద్ద మొత్తంలోనే ఆస్తి నష్టం జరిగింది. సంఘటన స్థలానికి నాలుగు ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను ఆర్పినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఫర్నిచర్ కోసం వాడే కెమికల్‌తో పాటు కొబ్బరి నారతో మంటలు మరింత ఎక్కువగా చెలరేగడంతో మంటలు అదుపులోకి రాలేదు. కార్వాన్ నియోజకవర్గం మొఘల్‌కా నాలాకు ఆనుకొని నిజాముద్దీన్ నవాబ్ అనే వ్యక్తికి చెందిన స్థలంగా చెబుతున్న ఓ పాత భవనంలో ఉన్న దుకాణాలలో వ్యాపారాలు కొనసాగుతున్నాయి. కాగా ఈ భవనానికి వెనుక వైపు దాదాపు రెండు వేల గజాల స్థలంలో కొన్ని రోజులుగా ఫీల్‌కానాకు చెందిన అబ్దుల్ రహీం అనే వ్యక్తి ఫర్నిచర్ తయారీ గోదామును నిర్వహిస్తున్నాడు. ఫర్నిచర్ గోదాములో సోఫాలు, చెక్కతో తయారయ్యే కుర్చీలు, డైనింగ్ టేబుల్స్‌తో పాటు వివిధ రకాల ఫర్నిచర్ తయారు చేస్తుంటారు. వీటి తయారీ కోసం వాడే చెక్కలు, కొబ్బరి నార, స్పాంజ్, ఫోమ్, రెక్సిన్‌తో పాటు కట్టె ఫర్నిచర్ షైనింగ్ కోసం వాడే కెమికల్ డ్రమ్ములు పెద్ద సంఖ్యలో గోదాములో నిల్వచేసి ఉన్నాయి. వేసవి కాలం కావడంతో ఫర్నిచర్‌కు మంచి గిరాకీ ఉంటుందని భారీ మొత్తంలోనే తెచ్చి తయారు చేస్తున్నారు. సోమవారం పదిన్నర గంటల సమయంలో గోదాంలో ఎక్సాస్ట్ ఫ్యాన్ వేసినప్పుడు విద్యుత్ షాక్ రావడంతో నిప్పు రవ్వలు ఎగిరి సమీపంలో ఉన్న కొబ్బరి నారపై పడడంతో ఒక్కసారిగా మంటలు అంటుకుని చెలరేగాయి. దీంతో ఫర్నిచర్ గోదాములో ఉన్న వ్యక్తులు ఆర్పేందుకు ప్రయత్నించగా అప్పటికే పెద్ద మొత్తంలో మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పక్కనే ఉన్న గుడిసెవాసులు అక్కడినుంచి భయంతో పరుగులు తీశారు. గోదాముకు ముందు భాగంలో వివిధ దుకాణాల వారు కూడా ఆయా దుకాణాలలో వస్తువులు కాలిపోతాయని భయంతో వస్తువులను బయటకు విసిరేశారు. కాగా మరోవైపు ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ గ్యారేజ్‌లోని బస్సులను వెంటనే అక్కడి నుంచి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు టప్పాఛబుత్రా పోలీస్‌స్టేషన్ పోలీసులు.. అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేసి సమాచారాన్ని అందించారు. ముందుగా లంగర్‌హౌస్‌కు చెందిన అగ్నిమాపక కేంద్రానికి చెందిన ఫైర్ ఇంజన్ సంఘటన స్థలానికి చేరుకుని మంటలను కొంతమేరకు అదుపులోకి తీసుకువచ్చారు. మరో మూడు ఫైర్ ఇంజన్లు సహాయంతో మంటలను అర్పినారు. ఫైర్ ఇంజన్లు రాకముందు ఫర్నిచర్ వస్తువులు కాలి పోయాయి. సంఘటనలో భారీగా ఆస్తి నష్టం వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దిన్.. సంఘటన స్థలానికి చేరుకుని జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.