క్రైమ్/లీగల్

మూడో అంతస్తు గోడ కూలి బాలుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 13: ఇంటికి అనుకొని ఉన్న ఓ భవనం మూడో అంతస్తు కూలిన ఘటనలో బాలుడు మృతిచెందిన సంఘటన మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళ్‌హాట్ డివిజన్‌లోని ధూల్‌పేట్ బడాబంగ్లా వద్ద ప్రైవేట్ ఉద్యోగి రాజు సింగ్, అతని భార్య జ్యోతి ఇద్దరు కుమారులు పంటు సింగ్, గోపాల్ సింగ్‌తో కలిసి రేకుల ఇంటో నివాసం ఉంటున్నారు. రాజు సింగ్ ఇంటికి అనుకోని నాలుగు అంతస్తుల భవనం ఉంది. ఇది నాలుగేళ్ల క్రితం నిర్మించారు. సోమవారం మధ్యాహ్నం రాజు సింగ్ తన భార్య పిల్లలతో కలిసి భోజనం చేస్తున్నారు. రాజు సింగ్ ఇంటికి అనుకొని ఉన్న నాలుగు అంతస్తుల భవనంలోని మూడో అంతస్తుకు సంబంధింని భవనం గోడ కూలింది. కూలిన గోడ రాజు సింగ్ రేకుల ఇంటిపై పడింది. దీంతో ఇటుకలు, రేకులు విరిగి భోజనం చేస్తున్న నలుగురిపై పడింది. ఈ ఘటనలో రాజు సింగ్ కుమారుడు గోపాల్ సింగ్ (11)కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా బాలుడు మృతిచెందాడు. రాజు సింగ్‌తో పాటు అతని భార్య జ్యోతి, కుమారుడు పింటు సింగ్‌కు తీవ్రగాయాలయ్యాయి. భోజనం చేస్తున్న సమయంలో ఆ కుటుంబం పాలిటా ఇంటికి అనుకోని ఉన్న భవనం కూలిన గోడ మృత్యువుగా మారింది. 11 ఏళ్ల బాలుడు మృతి చెందడంతో స్థానికులు పెద్ద ఎత్తున చేరుకుని సానుభూతి తెలిపారు. దూల్‌పేట్ బడాబంగ్లా వద్ద విషాద చాయాలు అలముకున్నాయి. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు మంగళ్‌హాట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. సంఘటన స్థాలానికి స్థానిక ఎమ్మెల్యే రాజా సింగ్ చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధితులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.