క్రైమ్/లీగల్

చోరీకి పాల్పడిన నిందితుడి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, మే 13: పని ఇచ్చిన షాపులోనే దొంగతనానికి పాల్పడిన ఓ వ్యక్తి కటకటాల పాలైన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. దుందిగల్ పీఎస్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో నిందితుని వివరాలను పేట్‌బషీరాబాద్ ఏసీపీ నర్సింహా రావు, డీఐ సంతోషమ్ వెల్లడించారు. బీ.శివ కుమార్ (22) సూరారం కాలనీ, కృషి కాలనీలో నివసిస్తూ కార్పెంటర్ పని చేస్తుంటాడు. సుచిత్ర, గోదావరి హోమ్స్‌లోని సాయి బాలాజీ ఉడ్ డోర్స్ షాపులో పీస్ వర్క్ పనిచేస్తుంటాడు. శివకుమార్ పనికి సక్రమంగా వెళ్లేవాడు కాదు. ఈనెల 11న రాత్రి ఒంటిగంట వరకు తోటి వర్కర్‌లతో పాటు పనిచేస్తున్నారు. శివకుమార్ వర్కర్లను షాపు యాజమాని ముఖ కవళికలను, డబ్బులు పెట్టడాన్ని గమనించాడు. అర్థరాత్రి షాపు యాజమాని, వర్కర్లు ప్రక్కనే ఉన్న భవనంలో నిద్రకు ఉపక్రమించారు. ఇదే అదునుగా చేసుకుని శివకుమార్ నిచ్చెన ద్వారా షాపు షెడ్డుపైకి ఎక్కాడు. షెడ్డు పైకప్పును తొలగించి ఎనిమిది ఫీట్ల ఎత్తులో ఉన్న షెడ్డు పైనుంచి లోనికి దూకాడు. ఈ క్రమంలో ముఖానికి గాయమైంది. షాపు యాజమాని దాచిన రూ.510000 నగదును దొంగిలించడంతో పాటు నిద్రలో ఉన్నవారి సెల్‌ఫోన్‌లను అపహరించి పరారయ్యాడు. షాపు యాజమాని ఫిర్యాదు మేరకు పేట్‌బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు శివ కుమార్ వద్ద నుంచి రూ.5.06 లక్షల నగదు, మూడు సెల్‌ఫోన్‌లను స్వాధీన పరుచుకుని రిమాండ్‌కు తరలించారు.