క్రైమ్/లీగల్

పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల విచారణ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో దాఖలైన పిటిషన్ విచారణ జూలై ఎనిమిదో తేదీకి వాయిదా పడింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ అనుమతులనూ సవాల్ చేస్తూ హర్షవర్థన్ అనే వ్యక్తి దాఖలు చేసిన మద్యంతరం పిటిషన్‌ను జస్టిస్ రఘువేంద్ర. ఎస్ రాథోడ్ నేతృత్వంలోని బెంచ్ సోమవారం విచారణ జరిపింది. దీనికి సంబంధించిన ప్రధాన పిటిషన్ విచారణ జూలై 8న విచారణకు రానున్న దృష్ట్యా రెంటిని కలిపి విచారణ జరుపుతామని ధర్మాసనం వెల్లడించింది.
కాళేశ్వరం పిటిషన్ వాయిదా
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దాఖలైన పిటిషన్ విచారణ జులై 10వ తేదీకి వాయిదా పడింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై హయాతుద్దీన్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ రఘువేంద్ర, ఎస్ రాథోడ్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు సోమవారం విచారణకు వచ్చింది. పిటిషన్ తరపు న్యాయవాది హాజరు కాకపోవడంతో జులై 10వ తేదీకి వాయిదా పడింది.