క్రైమ్/లీగల్

పునర్విచారణ వృథా ప్రయాస!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 28:దాదాపు 70 సంవత్సరాల క్రితం జరిగిన జాతిపిత మహాత్మా గాంధీ హత్య కేసును పునర్విచారించడం వృధా ప్రయాసేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. గాంధీ హత్య కేసులో అనేక కోణాలున్నాయని, ఈ కేసును మళ్లీ విచారించాలన్న ప్రయత్నాలకు బుధవారం తెరదించింది. ఈ హత్యపై కుట్ర కోణాన్ని దర్యాప్తు చేసేందుకు నియమించిన కపూర్ కమిషన్ నిష్పాక్షికత, స్పష్టతమైనా విచారించేందుకు నిరాకరించింది. ఈ కేసును మళ్లీ విచారించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండక పోవడమే కాకుండా కొత్త వివాదాలకు తెరతీసినట్టవుతుందని న్యాయమూర్తులు ఎస్‌ఎ బాబ్డే, ఎల్ నాగేశ్వరరావుతో కూడిన సుప్రీం బెంచి పేర్కొంది. పునర్విచారణ పిల్‌లో ఎలాంటి పస లేనందున దాన్ని కొట్టివేస్తున్నామని తన ఐదు పేజీల ఉత్తర్వులో సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. కపూర్ కమిషన్ తన నివేదిక ఇచ్చి 46 సంవత్సరాలు పూర్తయిన తర్వాత దానిపైనే అనుమానాలు వ్యక్తం చేస్తూ పిటిషనర్ చేసిన వాదనలతో తాము ఏకీభవించడం లేదని సుప్రీం బెంచి తెలిపింది. గాంధీ హత్య వెనుక గుర్తు తెలియని హస్తం ఉందని, ఆయనపై ప్రయోగించింది నాలుగు బులెట్లంటూ పిటిషనర్ తాజాగా వెలుగులోకి తెచ్చిన అంశాలనూ సుప్రీం కోర్టు తిరస్కరించింది. నేర నిర్థారణ, శిక్షలు అమలైన క్రిమినల్ కేసులను పునర్విచారించడం ఎంత మాత్రం సహేతుకం కాదని తేల్చిచెప్పింది. వీటి పునర్విచారణకు చట్టపరంగా కూడా ఎలాంటి అవకాశం లేదని ఉద్ఘాటించింది.