క్రైమ్/లీగల్

భారీ స్థాయిలో పట్టుబడిన గంజాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, మే 13: విశాఖ జిల్లా నర్సీపట్నంలో భారీగా గంజాయి పట్టుబడింది. ఒడిశాలోని మల్కన్‌గిరి నుండి అక్రమంగా తరలిస్తున్న సుమారు 2,500 కిలోల గంజాయిని నర్సీపట్నం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులతో సహా లారీ డ్రైవర్‌ను అరెస్ట్ చేసారు. ఈ అక్రమ రవాణాకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గంజాయిని తరలిస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులకు అందిన సమాచారం మేరకు సోమవారం ఉదయం పట్టణ పొలిమేర్లలోని నెల్లిమెట్ట వద్ద పట్టణ సీఐ లక్ష్మణరావు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. మల్కన్‌గిరి నుండి తవుడు బస్తాల లోడుతో వస్తున్న లారీని ఆపి తనిఖీ చేయగా బస్తాల మధ్యన ఉన్న గంజాయి మూటలను గుర్తించారు. చత్తీస్‌ఘడ్‌కు చెందిన ఈ లారీలో సుమారు 92 బస్తాల్లో మొత్తం 2,500 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్న లారీలో ఉన్న మల్కన్‌గిరికి చెందిన రాజుమాజీ(25), జైపూర్‌కు చెందిన సంతోష్‌ప్రధాన్(25), కుందన్‌గౌడ్(32)లను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసారు. నిందితుల వద్ద నుండి 3,200 రూపాయల నగదు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు సీఐ సీహెచ్ లక్ష్మణరావు తెలిపారు. నిందితులు తెలిపిన సమాచారం ప్రకారం పట్టుబడిన గంజాయిని మల్కన్‌గిరి నుండి తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణానికి తరలిస్తున్నట్లు సీఐ తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రెండు కోట్ల వరకు ఉంటుందని అంచనా. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిత్రం...విశాఖ జిల్లా నర్సీపట్నంలో భారీగా స్వాధీనం చేసుకున్న గంజాయి, పట్టుబడిన లారీ