క్రైమ్/లీగల్

కిడ్నీ రాకెట్‌పై ముమ్మర దర్యాప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 13: విశాఖ నగరంలో సంచలనం రేకెత్తించిన కిడ్నీ రాకెట్‌పై పోలీసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. శ్రద్ధ ఆసుపత్రికి చెందిన కీలక ప్రతినిధి ఒకరిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. కిడ్నీ రాకెట్‌పై దర్యాప్తునకు కలెక్టర్ ముగ్గురు సభ్యులతో నియమించిన కమిటీ ప్రతినిధులు సోమవారం ఆసుపత్రిని సందర్శించి వివరాలు సేకరించారు. ఇప్పటికే ఆపరేషన్ చేసిన వైద్యుడితో పాటు మధ్యవర్తి మంజునాథను అరెస్టు చేసిన పోలీసులు మరో కీలక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆసుపత్రి అడ్మినిస్ట్రేటివ్ అధికారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆసుపత్రి యాజమాన్యం ఇంకా పరారీలోనే ఉంది. అవయవ వ్యాపారం జరుగుతోందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రద్ధ ఆసుపత్రిలో గత ఎనిమిదేళ్లుగా ఈ వ్యవహారం సాగుతోందని భావిస్తున్నారు. దీనిలో భాగంగానే ఎనిమిదేళ్ల నుంచి అందుకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. అవయవ దానం పేరిట జరుగుతున్న వ్యాపారంపై దృష్టి సారించిన అధికారులు అనుమతులతో పాటు అవయవాలు దానం చేస్తున్న వారి అంగీకారం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. జరిగిన సంఘటన పూర్వా పరాలు పరిశీలిస్తే హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి పార్ధసారథి తన అవసరాల నిమిత్తం కిడ్నీ విక్రయించేందుకు సిద్ధపడ్డాడు. బెంగళూరుకు చెందిన వైద్యుడు మంజునాథ ద్వారా విశాఖలోని శ్రద్ధ ఆసుపత్రిలో కిడ్నీ శస్తచ్రికిత్స నిపుణుడు డాక్టర్ ప్రభాకర్‌ను సంప్రదించారు. కిడ్నీ మార్పిడి నిమిత్తం ఆసుపత్రి యాజమాన్యం కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కిడ్నీ దాతకు పూర్తి మొత్తం ఇవ్వకపోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో అధికారులు నగరంలోని ఇతర ఆసుపత్రుల్లో జరుగుతున్న అవయవ మార్పిడిపై కూడా దృష్టి సారించి వివరాలు సేకరించనున్నారు.