క్రైమ్/లీగల్

కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, మే 14: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్ధి రాచర్ల రాములు మంగళవారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రాదేశిక ఎన్నికల్లో ఆ గ్రామ ఎంపీటీసీ స్థానం నుండి పోటీ చేయడానికి తెరాస టిక్కెట్ ఆశించారు. అయితే పార్టీ మరొకరికి టిక్కెట్ కేటాయించడంతో, నామినేషన్ల సమయంలో రాములు కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ టిక్కెట్‌పై పోటీకి దిగారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు తనను హేళన చేస్తున్నారని, పార్టీ మారినా ఫలితం లేదనే ప్రచారం చేస్తున్నారని మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్టు సమీప బంధువులు పేర్కొంటున్నారు. రాములు ఇప్పటికే రెండు పర్యాయాలు స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచి పరాజయం పాలయ్యారు. దీంతో అప్పులపాలైన ఆయన తిరిగి తెరాసను వీడి కాంగ్రెస్‌లో చేరి ఎంపీటీసీగా పోటీ చేసినా ఈసారి కూడా ఎన్నికల్లో నెగ్గే అవకాశాల్లేవని భావించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్టు బంధువులు పేర్కొంటున్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ రాములును మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.