క్రైమ్/లీగల్

కమల్ హాసన్ పిటిషన్ కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదురై, మే 15: తనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాల్సిందిగా ప్రముఖ సినీ నటుడు, ఎంఎన్‌ఎం పార్టీ చీఫ్ కమల్ హాసన్ దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు తోసిపుచ్చింది. స్వాతంత్య్రం వచ్చి న తర్వాత మొట్టమొదటి తీవ్రవాది ఒక హిందువే అం టూ కమల్ హాసన్ చేసిన వ్యా ఖ్యలపై తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. గాంధీని హతమార్చిన నాథూరామ్ వినాయక్ గాడ్సే మొట్టమొదటి హిందూ తీవ్రవాది అని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్ మేరకు ఇక్కడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే, తాను ఎలాంటి పొరపాటు చేయలేదని, అప్పట్లో జరిగిన సంఘటనను మాత్రమే ప్రస్తావించానని కమల్ హాసన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అరవకురిచి పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను డిస్మిస్ చేయాల్సిందిగా ఆయన కోర్టును కోరారు. కాగా, కమల్ అభ్యర్థనను పరిశీలించిన మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ న్యాయమూర్తి బి.పుహళేంది అతని పిటిషన్‌ను కొట్టివేశారు.