క్రైమ్/లీగల్

శివార్లను కమ్ముకున్న మత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, మే 15: నగర శివార్లలో డ్రగ్ మాఫియా చాపకింద నీరులా కమ్ముకుంటోంది. ఆల్ఫాజోలం తయారీ ముఠాను ఎన్‌సీబీ అధికారులు గుట్టురట్టు చేసిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గుండ్లపోచంపల్లిలోని అపర్ణ పామ్‌గ్రోత్ వెంచర్ సమీపంలో ఎన్‌సీబీ అధికారులు విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. వెంచర్‌లోని ఓ ఖాళీ ప్రదేశంలో ఆల్ఫాజోలం చేతులు మారుతుండగా అధికారులు దాడి చేసినట్లు సమాచారం. ఫార్మా కంపెనీ పేరుతో ఆల్ఫాజోలం తయారు చేస్తున్న ముఠాలోని నలుగురిని ఎన్‌సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నిందితుల నుంచి సుమారు ఐదు కిలోల ఆల్ఫాజోలంతో పాటు మరికొన్ని మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. శివారులోని మూతపడ్డ ఫార్మా కంపెనీని అడ్డగా చేసుకుని మత్తు పదార్థాలను తయారు చేస్తున్నట్లు ఎన్‌సీబీ అధికారులకు సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న నలుగురిని అధికారులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.