క్రైమ్/లీగల్

కంభం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంభం, మే 15: ప్రకాశం జిల్లా కంభం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై బుధవారం ఎసిబి అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి అదనంగా ఉన్న సొమ్ము 46వేల 500 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలు ఏసీబీ డివైఎస్పీ టివిఎస్‌వి ప్రసాద్ బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ కంభం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గత కొంతకాలంగా రిజిస్ట్రేషన్ల సమయంలో అదనంగా వసూలు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదు రావడంతో దాడులు నిర్వహించి రిజిస్ట్రార్ కార్యాలయంలో పని చేస్తున్న అటెండర్ వంశీకృష్ణ దగ్గర 40వేలు, మద్యవర్తులుగా వ్యవహరిస్తున్న సందీప్ దగ్గర 1120 రూపాయలు, మహేష్ దగ్గర 1540 రూపాయలు, కౌశిక్ వద్ద 1360 రూపాయలు, వంశీ దగ్గర 2530 రూపాయలు ఉండగా స్వాధీనం చేసుకున్నామని అన్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం దోషులని తేలితే సంబంధిత వ్యక్తులను అరెస్టుచేస్తామన్నారు.