క్రైమ్/లీగల్

విద్యుదాఘాతంతో కొడుకు మృతి.. తట్టుకోలేక తండ్రి మృత్యువాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడేరు, మే 15: విద్యుదాఘాతానికి కొడుకు మృతి చెందగా, అతని మరణ వార్త విని తట్టుకోలేక తండ్రి కూడా మరణించిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో జరిగింది. వివరాలిలా ఉన్నాయ. కోడేరు మండల పరిధిలోని ఎత్తం గ్రామంలో బోయ కురుమయ్య (24) వరుసకు చెల్లెలు ఇంటివద్ద బుధవారం పెండ్లిపందిరి వేసేందుకు వెళ్లాడు. విద్యుత్ వైర్లు అడ్డం వస్తున్నాయని చెప్పడంతో వాటిని సరిచేసేందుకు దగ్గరలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆపేందుకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన గురించి తెలుసుకున్న తండ్రి వెంకటయ్య (55) తనకున్న ఒక్కగానొక్క కొడుకు మృతి చెందాడన్న ఆవేదనతో ఇంటిదగ్గర ప్రాణాలు విడిచారు. ఈ ఘటన గ్రామంలో అందరి హృదయాలను కలచివేసింది. స్థానిక పోలీసులు మృతదేహాలను కొల్లాపూర్ తరలించి కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిర్వహించారు. తల్లిదండ్రులకు ఒకే ఒక కొడుకు కావడం, కొడుకుతో పాటు భర్త కూడా చనిపోగా మృతుని భార్య బాధ వర్ణనాతీతం.