క్రైమ్/లీగల్

లోయలో పడిన ఆర్టీసీ బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మల్హర్, మే 15: ఆర్టీసీ బస్సు లోయలోకి పడిపోయన ప్రమాదంలో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యూరు పరిసర ప్రాంతంలోని పీవీ నగర్ మానేరు బ్రిడ్జి పక్కన లోయలో గోదావరిఖని ఆర్టీసీ అద్దె బస్సు ప్రమాదానికి గురైంది. బుధవారం గోదావరిఖని డిపోకు చెందిన ఏపీ 01 వై 2992 నెంబర్ అద్దె ఆర్టీసీ బస్సు గోదావరిఖని నుంచి భూపాలపల్లికి 63 మంది ప్రయాణికులతో పెద్దపల్లి జిల్లా మంథని బస్టాండ్ నుంచి బయలుదేరింది. మానేరు బ్రిడ్జి వద్ద డ్రైవర్ ఆజాగ్రత్త వల్ల ప్రమాదవశాత్తు లోయలో కి మళ్లిన బస్సు రెండు పల్టీలు కొట్టింది. దీంతో 63 మంది ఒక్కసారిగా ప్రాణాలు వదిలినట్లు అయిందని బాధితులు కన్నీరు పెట్టుకున్నారు. 30 మందికి స్వల్ప గాయాలు కాగా 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి కొయ్యూరు ఎస్‌ఐ ఇస్లావత్ నరేష్ నాయక్ చేరుకొని ప్రమాదంలో క్షతగాత్రులైన వారిని మంథని, మహాదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రాలతో పాటు కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, భూపాలపల్లి ఆసుపత్రులకు వైద్య చికిత్సల నిమిత్తం తరలించారు. సంఘటనా స్థలాన్ని భూపాలపల్లి ఎస్పీ ఆర్ భాస్కరన్ పరిశీలించారు. సంఘటన తీరుపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. తీవ్ర గాయాలైన వారిని వరంగల్ ఎంజీఎం, కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
కాటారం పీహెచ్‌సీలో చికిత్స
కాటారం: బస్సు బోల్తా పడిన దుర్ఘటనలో గాయాలపాలైనవారికి కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్సలు చేశారు. 63 మందితో మంథని నుంచి బయలు దేరిన బస్సు ఒక్కసారిగా మానేరు బ్రిడ్జి దాటిన తర్వాత ఓ పక్కన అగి ఉన్న ఇసుక లారీతో పాటు మూల మలుపు వద్ద ఎదురుగా మరో లారీ వస్తుండటంతో అదుపు తప్పి రోడ్డు దిగి లోయలో పడి పోయిందని ప్రయాణికులు తెలిపారు. బస్సు డ్రైవర్ ఆజాగ్రత్తకు తోడు రోడ్డు పైన నిలిచి ఉన్న ఇసుక లారీల వల్ల దారి లేక రోడ్డు కిందకు బస్సును దించడం వల్ల మట్టి రోడ్డు కావడంతో బస్సు లోయలోకి జారి రెండు పల్టీలు కొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదానికి గురి కాగానే డ్రైవర్ పరారయ్యాడు. విషయం తెలుసుకున్న కాటారం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కాగితోజు శివ ప్రసాద్, కొయ్యూరు ఎస్‌ఐ ఇస్లావత్ నరేష్ నాయక్‌లు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. గాయపడినవారిని మంథని, మహాదేవపూర్, కాటారం, భూపాలపల్లి తదతర ఆసుపత్రులకు ప్రభుత్వ, ప్రైవేటు అంబులెన్సులు, వాహనాలలో తరలించారు. 10 మందికి తీవ్ర గాయాలు కాగా వారిని మరింత మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్టు కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి ఉమాదేవి, కాటారం 2 ఎస్‌ఐ జహీర్‌ఖాన్ తెలిపారు.
చిత్రం... మానేరు బ్రిడ్జి లోయలో పడిన ఆర్టీసీ బస్సు